Breaking News

నేడు రాష్ట్రపతి భవన్‌లో తొలి పెళ్లి బాజాలు.. వివాహం ఎవరికంటే..

Published on Wed, 02/12/2025 - 08:02

న్యూఢిల్లీ: రాష్గ్రపతి భవన్‌.. దేశంలోని ప్రముఖ స్మారక నిర్మాణాలలో ఒకటైన ఈ భవన్‌లో తొలిసారిగా ఈరోజు(బుధవారం) ఒక వివాహ వేడుక జరగనుంది. 300 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ భవనం నాలుగు అంతస్తులతో 340 గదులను కలిగి ఉంది. ఢిల్లీలో ఉన్న ఈ చారిత్రాత్మక భవనం కొన్నేళ్లుగా ఉన్నత స్థాయి అంతర్జాతీయ ప్రముఖులకు ఆతిథ్యం ఇస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు దీనికి భిన్నంగా రాష్టప్రతి భవన్‌ ఒక వివాహానిక వేదికగా నిలవనుంది.  

ఫిబ్రవరి 12న రాష్ట్రపతి భవన్‌లోని మదర్ థెరిసా క్రౌన్ కాంప్లెక్స్‌లో ఒక జంట వివాహం చేసుకోబోతోంది. వధూవరులిద్దరూ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(
సీఆర్‌పీఎఫ్‌)లో పనిచేస్తున్నారు. ఈ వివాహానికి ఇరు కుటుంబాలవారు మాత్రమే హాజరుకానున్నారు. వధువు పేరు పూనమ్ గుప్తా. ఈమె సీఆర్‌పీఎఫ్‌లో వ్యక్తిగత భద్రతా అధికారిణి. వరుని పేరు అవనీష్ కుమార్. ఈయన సీఆర్‌పీఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్.

74వ గణతంత్ర దినోత్సవ కవాతులో మహిళా బృందానికి పూనమ్ గుప్తా నాయకత్వం వహించారు. ఆమెకు కాబోయే భర్త అవనీష్ కుమార్ ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. పూనమ్ గుప్తా విధి నిర్వహణలో చూపిన అంకితభావాన్ని గుర్తించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో వారి వివాహానికి అనుమతినిచ్చారు.

సీఆర్‌పీఎఫ్‌ అధికారిణి పూనమ్ గుప్తా మధ్యప్రదేశ్ నివాసి. గణితంలో గ్రాడ్యుయేషన్‌ చేశారు. అనంతరం ఆంగ్ల సాహిత్యంలో పీజీ చేశారు. బీఈడీ కూడా పూర్తి చేశారు. 2018లో ఆమె యూపీఎస్‌సీ సీఆర్‌పీఎఫ్‌ పరీక్షలో 81వ ర్యాంకు సాధించారు. బీహార్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో పూనమ్ గుప్తా ప్రశంసనీయమైన సేవలు అందించారు.

ఇది కూడా చదవండి: Mahakumbh-2025: పోటెత్తిన జనం.. కొనసాగుతున్న మాఘ పూర్ణిమ స్నానాలు

Videos

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)