Breaking News

కోవిడ్‌ తర్వాత పెరిగిన పర్యాటకరంగ ఉపాధి!

Published on Tue, 04/30/2024 - 07:51

కోవిడ్‌ మహమ్మారి తగ్గుముఖం పట్టాక దేశంలో పర్యాటకరంగంలో ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరిగాయి. 2033 నాటికి అంటే రాబోయే తొమ్మిదేళ్లలో ట్రావెల్ అండ్ టూరిజం రంగంలో దేశంలో 5.82 కోట్ల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. కరోనా సమయంలో అంటే 2020లో పర్యాటక రంగంలో 3.9 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇది దేశంలోని మొత్తం ఉపాధిలో 8 శాతం.

తాజాగా ఎన్‌ఎల్‌బి సర్వీసెస్ నివేదిక ప్రకారం మహమ్మారి నుండి కోలుకున్న తర్వాత పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందింది. ఈ రంగం 2023 క్యాలెండర్ సంవత్సరంలో 16 లక్షల అదనపు ఉద్యోగాలను అందించింది. జనవరి 2023 నుండి ప్రయాణ, పర్యాటక రంగంలో రోజువారీ వేతన ఉద్యోగాలు 14 శాతం మేరకు పెరిగాయి. అనువాదకులు,  ఫోటోగ్రాఫర్లు, టూర్ గైడ్‌లకు ఉద్యోగావకాశాలు ఏర్పడ్డాయి. వచ్చే రెండేళ్లలో పర్యాటక రంగంలో ఉద్యోగాలు 20 శాతం మేరకు పెరుగుతాయని అంచనా.

ఎన్‌ఎల్‌బి సర్వీసెస్ నివేదికలోని డేటా ప్రకారం పర్యాటక రంగం 2022లో భారతదేశ జీడీపీకి 15.9 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని అందించింది. అదే సమయంలో ఇది విదేశీ మారకద్రవ్యానికి ముఖ్య వనరుగా నిలిచింది. ఎన్‌ఎల్‌బి సర్వీసెస్ సీఈఓ సచిన్ అలగ్ మీడియాతో మాట్లాడుతూ పర్యాటకరంగంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణె, కొచ్చి, జైపూర్, అహ్మదాబాద్, చండీగఢ్‌లో ఉపాధి అవకాశాలు మరింతగా పెరిగాయి.

పర్యాటకరంగంలో సేల్స్ లో18 శాతం, బిజినెస్ డెవలప్‌మెంట్‌లో 17 శాతం, చెఫ్ విభాగంలో15 శాతం, ట్రావెల్ కన్సల్టెంట్‌లో 15 శాతం మేరకు ఉపాధి పెరగవచ్చనే అంచనాలున్నాయి.  అలాగే టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, హోటళ్లు, గైడ్‌లు , వన్యప్రాణి నిపుణులకు కూడా మంచి డిమాండ్ ఏర్పడే అవకాశాలున్నాయి. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)