Breaking News

క్యాంటిన్‌ నుంచి తెచ్చిన టీ తాగి..

Published on Sat, 08/23/2025 - 02:06

రాంచీ: జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని రిమ్స్‌ గైనకాలజీ విభాగం పీజీ విద్యార్థిని   ఒకరు అనుమానాస్పద స్థితిలో తీవ్ర అనారోగ్యానికి గురై వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి క్యాంటిన్‌ నుంచి తెచ్చిన టీ తాగుతూనే ఆమె అపస్మారక స్థితిలోకి జారుకున్నారని అధికారులు తెలిపారు. విష ప్రయోగంగా అనుమానిస్తున్నట్లు ఎయిమ్స్‌ ప్రతినిధి శనివారం తెలిపారు. గురువారం రాత్రి రిమ్స్‌ గైనకాలజీ విభాగం ఆర్థోపెడిక్‌ వార్డులో 25 ఏళ్ల బాధిత విద్యార్థిని ఉన్నారు. క్యాంటిన్‌ నుంచి ఫ్లాస్‌్కలో తెచి్చన టీని గ్లాసులోకి వంపుకుని పక్కన పెట్టుకున్నారు.

 ఖాళీ దొరికిన వెంటనే రెండు సార్లు చప్పరించారు. టీ బాగోలేదని, దుర్వాసన వస్తోందని ఆమె తెలపడంతో తోటి వారు ఆ టీ జోలి పోలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడి వారు వెంటనే ఆమెను ఎమర్జెన్సీకి తీసుకెళ్లారు. ‘బాధిత విద్యారి్థని ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. వచ్చే 48 గంటలు చాలా కీలకం. ఫ్లాస్‌్కతోపాటు అక్కడున్న ఇతర వస్తువులన్నిటినీ సీజ్‌ చేసి, టాక్సికాలజీ పరీక్షలకు పంపించాం. ఇది విష ప్రయోగంగా కనిపిస్తోంది’అని ఓ అధికారి తెలిపారు. పరీక్షల ఫలితాలు అందాకే వాస్తవం వెల్లడవుతుందని రిమ్స్‌ ప్రతినిధి డాక్టర్‌ రాజీవ్‌ రంజన్‌ చెప్పారు. క్యాంటిన్‌ సీల్‌ చేసి, టీ ఫ్లాస్క్‌ తీసుకువచి్చన క్యాంటిన్‌ ఉద్యోగిని పోలీసులు ప్రశి్నస్తున్నారు.  

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)