గాంధీ టోపీ వెనుక ‘నవాబుల కథ’

Published on Mon, 09/30/2024 - 13:14

లక్నో: అక్టోబర్‌ 2.. గాంధీ జయంతి. దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకురావడంలో మహాత్ముని కృషి మరువలేనిది. గాంధీజీ 1869, జనవరి 30న గుజరాత్‌లోని పోరుబందర్‌లో జన్మించారు. గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆ మహనీయుని గుర్తు చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. గాంధీ జీవితంలో అనేక ప్రత్యేక ఘట్టాలు కనిపిస్తాయి. గాంధీ ధరించిన టోపీ వెనుక ప్రత్యేక చరిత్ర ఉంది.  

యూపీలోని రాంపూర్ నవాబుల సంప్రదాయాలు భారత స్వాతంత్య్ర పోరాటానికి ప్రత్యేక అధ్యాయాన్ని అందించాయి. మహాత్మా గాంధీ  ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నవాబుల రాజ సంప్రదాయమైన టోపీని ధరించారు. అనంతరం అది  గాంధీ టోపీ పేరుతో ప్రసిద్ధి చెందింది. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి చిహ్నంగానూ మారింది.

1918 డిసెంబర్ 30న ఖిలాఫత్ ఉద్యమ నాయకులు మౌలానా షౌకత్ అలీ, మహమ్మద్ అలీలను కలుసుకునేందుకు గాంధీ మొదటిసారిగా రాంపూర్ వచ్చారు. 1919లో ఆయన రెండవసారి ఆయన రాంపూర్‌ వచ్చినప్పుడు ఈ టోపీ ధరించారు. ఈ పర్యటనలో ఆయన నాటి నవాబు సయ్యద్ హమీద్ అలీఖాన్ బహదూర్‌ను కలుసుకునే సందర్భం వచ్చింది. ఆనాటి సంప్రదాయం ప్రకారం నవాబును కలుసుకునే సమయంలో తలను టోపీతోనే లేదా ఏదైనా వస్త్రంతోనే కప్పుకోవాల్సి ఉంది. అయితే ఆ సమయంలో గాంధీ దగ్గర అటువంటిదేమీ లేదు.

దీంతో ఆయన రాంపూర్ మార్కెట్‌లో టోపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. అయితే టోపీ ఎక్కడా దొరకలేదు. ఈ పరిస్థితిని చూసిన మౌలానా షౌకత్ అలీ, ఆయన తల్లి అబ్దీ బేగం స్వయంగా గాంధీకి టోపీ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలోనే గాంధీ టోపీ రూపొందింది.  తదనంతర కాలంలో భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ టోపీ.. ఉద్యమ చిహ్నంగానూ మారింది.  ఇది నాటి భారతీయుల ఐక్యతకు చిహ్నంగా నిలిచింది. నేటికీ పలు చోట్ల మనకు గాంధీ టోపీ కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: పూజారిని చంపిన చిరుత.. 10 రోజుల్లో ఆరో ఘటన

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)