Breaking News

ఛత్తీస్‌గఢ్‌ సీఎం రేసులో వెనుకబడిన రమణ్‌ సింగ్‌!

Published on Sun, 12/10/2023 - 11:57

మొన్నటి అసెంబ్లీ ఎ‍న్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఈ నేపధ్యంలో బీజేపీ మరో విజయానికి ఇక్కడి నుంచే బీజం వేయాలని భావిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికలలోనూ ప్రభావం చూపే నేతను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ భావిస్తోంది. 

ఛత్తీస్‌గఢ్‌లో  అధికారాన్ని ఓబీసీ గిరిజన నేతకు అప్పగించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఈ వ్యూహాల నేపధ్యంలో ముఖ్యమంత్రి పదవి రేసులో మాజీ సీఎం రమణ్ సింగ్ పేరు వెనుకబడింది. సీఎం పదవికి బీజేపీ కొత్త పేరును పరిశీలిస్తోంది. చత్తీస్‌గఢ్‌లో సీఎం రేసులో ఎంపీ రేణుకా సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సావో, ఎంపీ గోమతి సాయి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా రేసులో ఉన్నారని చెప్పినప్పటికీ, మిగిలినవారు ఈ రేసులో ముందున్నారు. రమణ్ సింగ్ 71 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపధ్యంలో అతనిని పక్కన పెట్టాలని బీజేపీ భావిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ఛత్తీస్‌గఢ్ సీఎం రేసులో లతా ఉసేంది, రాంవిచార్ నేతమ్, విష్ణుదేవ్ సాయి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. విష్ణుదేవ్ సాయి గిరిజన నాయకుడు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. మూడుసార్లు ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షునిగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు.

ఛత్తీస్‌గఢ్‌ సీఎం ఎంపిక కోసం ఈరోజు (ఆదివారం) జరిగే శాసనసభా పక్ష సమావేశంలో ముగ్గురు పరిశీలకులు, జార్ఖండ్ మాజీ సీఎం, గిరిజన నాయకుడు అర్జున్ ముండా, అస్సాం మాజీ సీఎం, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, పార్టీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పరిశీలకులు సీఎం ఎంపిక విషయంలో ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకుని పార్టీ హైకమాండ్‌కు తెలియజేస్తారని విశ్వసనీయ సమాచారం. 
ఇది కూడా చదవండి: బొగ్గు గనుల మూసివేత పరిణామాలేమిటి? కూలీలు ఏం చెయ్యాలి?

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)