Breaking News

నేడు రామాలయ ట్రస్ట్‌ భేటీ

Published on Mon, 07/06/2026 - 05:35

అయోధ్య: అయోధ్య రామాలయం శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ కీలక సమావేశం సోమవారం జరగనుంది. ఆలయ విరాళాల చోరీ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్, ట్రస్టీ అనిల్‌ మిశ్రా సమర్పించిన రాజీనామాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. ఆలయ ట్రస్ట్‌ అధ్యక్షుడి ఆశ్రమంలో జరిగే ఈ భేటీకి ట్రస్ట్‌ సభ్యులు, ఎక్స్‌ అఫీషియో సభ్యులంతా హాజరు కావాలని ట్రస్ట్‌ ట్రెజరర్‌ గోవింద్‌ కోరారు.

వయో సంబంధ సమస్యలతో చికిత్స పొందుతూ శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 89 ఏళ్ల ట్రస్ట్‌ అధ్యక్షుడు నృత్య గోపాల్‌ దాస్‌ సమావేశానికి వస్తారని తెలుస్తోంది. ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసుకునేందుకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి(సీఈవో)ని నియమించే విషయం చర్చకు రానుంది.  ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న గోపాల్‌ రావు పాత్రపైనా చర్చ జరిగే అవకాశముందంటున్నారు. ఆలయంలో విరాళాల మాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ అందజేసిన మధ్యంతర నివేదికలోని అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.

ఈ భేటీలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆలయ ఆదాయ వ్యయాల నివేదికను ఆమోదించనున్నారు. ప్రస్తుతం ట్రస్ట్‌ అధ్యక్షుడు నృత్యగోపాల్‌ దాస్‌తోపాటు 11 మంది రెగ్యులర్‌ సభ్యులున్నారు.  ఆలయ విరాళాల వ్యవహారంపై ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే వ్యక్తం చేసిన అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు సంస్థ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చెప్పారు. అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వ్యవహారం హిందూ సమాజం నమ్మకాన్ని తీవ్రంగా గాయపరిచిందని ఇటీవల హొసబలే పేర్కొన్నారు. ఈ దురదృష్టకర ఘటనను ఆసరాగా చేసుకుని కొన్ని శక్తులు హిందూ ధర్మం ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వీటిని హిందూ సమాజం ఓపిక, నిగ్రహంతో ఐక్యంగా ఎదుర్కోవాలని ఆయన కోరారు.  

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)