Breaking News

పెరోల్‌పై డేరా బాబా విడుదల.. ఆశ్రమంలో సందడి

Published on Wed, 10/02/2024 - 09:25

రోహ్ తక్(హర్యానా): డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా)పెరోల్ పై విడుదలయ్యారు. రోహ్‌తక్‌లోని సునారియా జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన పోలీసు భద్రత మధ్య యూపీలోని తన బర్నావా ఆశ్రమానికి చేరుకున్నారు. దీంతో ఆశ్రమంలో సందడి వాతావరణం నెలకొంది.

రామ్ రహీమ్‌కు ఇరవై రోజుల పెరోల్ మంజారయ్యింది. ఈ పెరోల్ వ్యవధిలో రామ్ రహీమ్‌ ఎన్నికల సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనకూడదని, హర్యానాలోకి ప్రవేశించకూడదనే నిబంధన ఉంది. అక్టోబర్ 5న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్ రహీమ్  20 రోజుల పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు అతనికి పెరోల్ మంజూరైంది. పెరోల్ నిబంధనల ప్రకారం డేరా చీఫ్ హర్యానా ఎన్నికలకు దూరంగా ఉండాలి.
 

రామ్ రహీమ్ పెరోల్ దరఖాస్తును జైలు అధికారులు ఎన్నికల కమిషన్‌కు పంపారు. పెరోల్‌ లభిస్తే తాను ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఉండేందుకు సిద్ధమని డేరా చీఫ్‌ తెలిపారు. 2017లో తన ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేసిన కేసులో రామ్ రహీమ్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే 16 ఏళ్ల క్రితం ఒక జర్నలిస్టును హత్య చేసిన కేసులో రామ్ రహీమ్‌తో పాటు మరో ముగ్గురికి కూడా 2019లో జైలు శిక్ష పడింది.

ఇది కూడా చదవండి: మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)