Breaking News

Ram Mandir: ‘ భూమ్మీద అత్యంత అదృష్టవంతుడను నేనే’

Published on Mon, 01/22/2024 - 16:52

అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. సర్వాంగ సుందరంగా, నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగింది. గణేశ్వర్‌ శాస్త్రి ద్రవిడ్‌ నేతృత్వంలో మహా గంభీరంగా ప్రాణప్రతిష్ట క్రతువు నిర్వహిం‍చారు. రామ్‌ లల్లా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ట కర్తగా వ్యవహరించారు.  

ప్రాణప్రతిష్ట చేసిన బాల రాముడి విగ్రహం జీవకళ ఉట్టిపడుతోంది. ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన శిల్పి అరుణ్‌ యోగిరాజ్ సుందరంగా చెక్కిన విషయం తెలిసిందే. సోమవారం అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న అరుణ్‌ యోగిరాజ్‌ మీడియాతో మాట్లాడారు. ‘నేను ఈ భూమి మీద ఉన్న అదృష్టమైన వ్యక్తిగా భావిస్తున్నాను. భగవాన్‌ శ్రీ రామ్‌ లల్లా, మా పూర్వికులు, కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు ఎల్లప్పడూ నాతో ఉంటాయి. ఇప్పటికీ నాకు ఊహాలోకంలో​ ఉన్నట్లు అనిపిస్తోంది’ అని యోగిరాజ్‌ పేర్కొన్నారు. 

అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించే రాముని విగ్రహాన్ని ఎంపిక చేయడానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సమావేశంలో ఓటింగ్‌ నిర్వహించి విషయం తెలిసిందే. ప్రత్యేక శిల్పులు రూపొందించిన మూడు నమూనాల్లో ఒక విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఇందులో యోగి రాజు చెక్కిన బాలరాముని శ్యామవర్ణ విగ్రహం ఎక్కువ ఓట్లు పొందిన అత్యుత్తమ విగ్రహంగా నిలిచింది.

రామ్‌ లల్లా విగ్రహ విశేషాలు..
► అయోధ్య రామాలయంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు.  
► నల్లరాతిపై చెక్కిన బాల రాముడి ప్రతిమ. నీలమేఘ శ్యాముడంటూ రామాయణంలోని వర్ణనకు అనుగుణంగా ఈ రాతిని ఎంచుకున్నారు.
► రామ్‌లల్లాను చెక్కిన శిల బరువు దాదాపు 200 కిలోలు.  
► ఐదేళ్ల బాలుడి రూపంలో రామ్‌లల్లా విగ్రహాన్ని రూపొందించారు.
► ఓ చేతిలో బాణం పట్టుకుని, మరో చేతితో ఆశీర్వాదం ఇస్తున్న రూపంలో విగ్రహాన్ని మలిచారు.
► స్వచ్ఛమైన బంగారంతో విల్లంబులు తయారుచేసి బాల రాముడి చేతిలో అలంకరించారు.
► శ్రీరామ నవమి రోజున గర్భగుడిలో సూర్య కిరణాలు పడేలా ఏర్పాట్లు
► శ్రీరాముడికి సూర్య తిలకంలో కిరణాలు పడేలా ఏర్పాట్లు

చదవండి: Ayodhya Ram Mandir: భావోద్వేగానికి లోనైన దిగ్గజ నేతలు

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)