Breaking News

ఆదాయంలో షిర్డీ, వైష్ణోదేవిలను దాటిన అయోధ్య

Published on Mon, 02/17/2025 - 13:15

అయోధ్య: యూపీలోని అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరిగినది మొదలు భక్తులు తండోపతండాలుగా అయోధ్యకు తరలివస్తున్నారు. ఇప్పుడు యూపీలో జరుగుతున్న కుంభమేళాకు వచ్చిన భక్తులు అయోధ్యకు వచ్చి, బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు.

ఇక్కడకు వచ్చిన రామభక్తులంతా ఆలయానికి భారీగా విరాళాలు ఇ‍వ్వడంతో పాటు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించుకుంటున్నారు. కానుకల విషయంలో అయోధ్య అటు షిర్డీ, ఇటు వైష్ణోదేవి అలయాలను దాటేసింది. అయోధ్య రామాలయంలో బాల రాముని ప్రాణప్రతిష్ఠ 2024, జనవరి 22న జరిగింది. అప్పటి నుంచి నేటివరకూ 13 కోట్ల మంది బాలరాముణ్ణి దర్శించుకున్నారు.

అయోధ్య ఆలయానికి అందుతున్న కానుకల విషయానికొస్తే స్వర్ణదేవాలయం, వైష్ణోదేవి, షిర్డీ ఆలయాలకు మించిన రీతిలో కానుకలు అందుతున్నాయి. గడచిన ఏడాదిలో ఆలయానికి కానుకలు, విరాళాల రూపంలో మొత్తం రూ. 700 కోట్లు అందింది. మహాకుంభ్‌ ప్రారంభమయ్యాక రూ. 15 కోట్ల ఆదాయం సమకూరింది. దేశంలో అత్యధికంగా ఆదాయం అందుతున్న 10 ఆలయాలలో అయోధ్య మూడవ స్థానానికి చేరింది. ఒక నివేదికను అనుసరించి చూస్తే షిర్డీ ఆలయానికి ఏటా రూ. 450 కోట్ల వరకూ ఆదాయం సమకూరుతుండగా, వైష్ణోదేవికి ప్రతీయేటా రూ. 400 కోట్ల వరకూ ఆదాయం అందుతోంది.

ఇది కూడా చదవండి: బిడ్డకు ఊపిరిపోసి, ప్రాణాలొదిలిన బ్రెయిన్‌ డెడ్‌ తల్లి..

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు