Breaking News

రాములోరికి 44 క్వింటాళ్ల లడ్డూల భోగం!

Published on Thu, 01/11/2024 - 11:07

2019 నవంబర్‌లో సుప్రీం కోర్టు ఇచ్చిన ‘రామ జన్మభూమి’ తీర్పు రామభక్తులకు ఎనలేని సంతోషాన్నిచ్చింది. 2020 ఆగస్ట్ 5న ప్రధాని నరేంద్ర మోదీ నూతన రామాలయ భూమి పూజను నిర్వహించడంతో రామ భక్తులు సంబరాలు చేసుకున్నారు. ఇక ఇప్పుడు రాబోయే 22న నూతన రామాలయం ప్రారంభం కానుండటంతో రామభక్తులు పెద్దఎత్తున పండుగ చేసుకోబోతున్నారు. 

2024‍, జనవరి 22.. ఈ తేదీ చరిత్ర పుటల్లో నమోదుకానుంది. శ్రీ రాముడు ఆ రోజున దివ్యమైన రామాలయంలో కొలువుదీరనున్నాడు. ఈ నేపధ్యంలో పలువురు భక్తులు రాములోరికి విలువైన కానుకలు సమర్పిస్తున్నారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడికి తరలివచ్చే భక్తులకు ‘దేవ్రహా బాబా’ లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ ప్రసాదాన్ని స్వచ్ఛమైన దేశీ నెయ్యితో తయారు చేస్తున్నారు. 

‘దేవ్రహా బాబా’  రామ మందిర నిర్మాణాన్ని ముందే ఊహించిన సాధువు. శ్రీరాముడు జన్మించిన ప్రదేశం ఇదేనని ఆయనే తెలియజేశారు. శ్రీరామునికి భోగంగా సమర్పించేందుకు 44 క్వింటాళ్ల లడ్డూలను దేశీ నెయ్యితో తయారు చేస్తున్నామని, ఒక్క చుక్క నీరు కూడా వాడలేదని దేవ్రహ బాబా శిష్యులు తెలిపారు. ఈ లడ్డూలు ఆరు నెలల వరకూ చెడిపోవని పేర్కొన్నారు. 

ఈ లడ్డూలను వెండి పళ్లెంలో రామ్‌లల్లాకు  నైవేద్యంగా సమర్పిస్తామన్నారు. అనంతరం వీటిని భక్తులకు ప్రసాదంలా పంపిణీ చేయనున్నామన్నారు. 44 క్వింటాళ్ల బరువు కలిగిన ఒక వేయి 111 లడ్డూలను తయారు చేస్తున్నామన్నారు. శ్రీరామునికి ఈ విధమైన సేవ చేయడం తమకు ఎంతో ఆనందదాయకంగా ఉందని దేవ్రహ బాబా శిష్యులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: అయోధ్యలో హోటల్‌ గది అద్దెలు ఆకాశానికి!

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌