Breaking News

బాల రాముడికి సూర్యతిలకం

Published on Mon, 04/07/2025 - 05:07

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. భవ్య మందిరంలో కొలువుదీరిన బాల రాముడికి ఆదివారం సూర్య భగవానుడు తిలకం అద్దడం చూసి భక్తులు పులకించిపోయారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన తిలకం 4 నిమిషాలపాటు కొనసాగడం అమితంగా ఆకట్టుకుంది. కొందరు గర్భాలయంలో ఆనందంతో నృత్యాలు చేశారు. 

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా సూర్యతిలకం అద్దే కార్యక్రమం నిర్వహించినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. అలాగే ప్రభు శ్రీరామ్‌లల్లాకు అర్చకులు ప్రత్యేకంగా మహా మస్తకాభిషేకం నిర్వహించినట్లు తెలియజేసింది. 56 పదార్థాలతో కూడిన భోగ్‌ను శ్రీరాముడికి నివేదించారు. ప్రత్యేక హారతి ఇచ్చారు. గర్భాలయంలో సూర్యతిలకం, మహా మస్తకాభిషేకాన్ని నేరుగా చూడలేని భక్తులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి తన్మయులయ్యారు. శ్రీరామ నవమి సందర్భంగా బాలరాముడిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. 10 లక్షల మందికిపైగా తరలివచ్చినట్లు అంచనా.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)