Breaking News

అయోధ్య: ఆ రెండు విగ్రహాలను ఏం చేయనున్నారు?

Published on Wed, 01/17/2024 - 11:02

అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రామ్‌లల్లా నేడు(బుధవారం) ఆలయ ‍ప్రాంగణంలోకి ప్రవేశించనున్నారు. ముందుగా రామ్‌లల్లా విగ్రహాన్ని రామజన్మభూమి కాంప్లెక్స్‌కు తీసుకువెళతారు. అనంతరం గర్భగుడిని శుద్ధి చేసి, గురువారం శ్రీరాముని విగ్రహాన్ని గర్భగుడిలోనికి తీసుకువస్తారు. 

రామాలయంలో ప్రతిష్ఠించేందుకు తొలుత మూడు బాలరాముని విగ్రహాలను రూపొందించగా, అరుణ్‌ యోగిరాజ్‌ తీర్చిదిద్దిన రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠాపనకు ఎంపిక చేశారు. దీంతో మిగిలిన రెండు విగ్రహాలను ఏమిచేయనున్నారనే ప్రశ్న అందరి మదిలో మెదలాడింది. దీనికి సమాధానాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు వెల్లడించారు.

అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించేందుకు మూడు విగ్రహాలు తయారు చేయించామని, దానిలో ఒక విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు ఎంపిక చేశామని, మిగిలిన రెండు విగ్రహాలను ఆలయంలోని మొదటి, రెండో అంతస్తుల్లో ఏ‍ర్పాటు చేస్తామని చంపత్ రాయ్ తెలిపారు. రామ మందిరం మొదటి అంతస్తు సిద్ధమైన వెంటనే రెండు రామ్‌లల్లా విగ్రహాలలో ఒకదానిని వైదిక ఆచారాలతో అక్కడ ప్రతిష్ఠించనున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబర్ 2025 నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత, మిగిలిన రెండవ విగ్రహాన్ని రెండవ లేదా చివరి అంతస్తులో ప్రతిష్ఠించనున్నామన్నారు.

అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రామాలయం గర్భగుడిలో ఏర్పాటు చేసేందుకు కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన నల్లరాతి విగ్రహాన్ని ఆలయ ట్రస్ట్ ఎంపిక చేసింది. మిగిలిన రెండు విగ్రహాలలో ఒకటి కర్నాటకకు చెందిన గణేష్ భట్ నల్లరాతితో తీర్చిదిద్దారు. ఇంకొక విగ్రహాన్ని రాజస్థాన్‌కు చెందిన సత్య నారాయణ పాండే తెల్లని మక్రానా పాలరాతితో రూపొందించారు. ఈ మూడు విగ్రహాలూ 51 అంగుళాల ఎత్తులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: 2,100 కిలోల గంట.. 108 అడుగుల అగరుబత్తి

Videos

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)