Breaking News

రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ సస్పెన్షన్ 

Published on Tue, 08/08/2023 - 11:50

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ సస్పెండ్ చేస్తున్నట్లు సభ చైర్మన్‌ జగదీప్ ధన్‌కర్ మంగళవారం వెల్లడించారు.  ఈ సస్పెన్షన్ వేటు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు పూర్తయ్యే వరకు కొనసాగుతుందని చెప్పారు. 

మంగళవారం రాజ్యసభ సమావేశాలు మొదలవుతూనే ఢిల్లీ అధికారాలు గురించిన వాడి వేడి చర్చ మొదలైంది. ఇదే క్రమ్మలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి అదేపనిగా నినాదాలు చేశారు. స్పీకర్ పలు మార్లు వారించే ప్రయత్నం చేసినా కూడా ఆయన వినిపించుకోకుండా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో విసుగు చెందిన స్పీకర్ ఒబ్రెయిన్ పై ససపెన్షన్ వేటు విధించారు. సభలో అనుచితంగా వ్యవహరించి సభా కార్యకలాపాలకు అడ్డంకిగా నిలిచినందుకు ఆయనపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు తెలిపారు. ఈ సస్పెన్షన్ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు వర్తిస్తుందని అన్నారు.  

స్పీకర్ మాట్లాడుతూ.. ఇది మీకు అలవాటుగా మారిపోయింది. ఇదంతా మీ ప్రణాళికలో భాగమేనని మాకు అర్ధమవుతుంది. ఇలా చేస్తే మీకు బయట పబ్లిసిటీ వస్తుందన్నది మీ ఉద్దేశ్యం. మీ హోదాని దిగజార్చుకుంటూ చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. సభా గౌరవాన్ని కించపరచడం భావ్యం కాదని చెబుతూ డెరెక్ ఒబ్రెయిన్ పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు తెలిపారు.   

అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పైన కూడా స్పీకర్ ఇదే విధంగా సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. 

ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న యాత్రికులు 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)