Breaking News

అది ‘బ్లూ సిటీ ఆఫ్‌ ఇండియా’.. ఉదయం, సాయంత్రం వేళల్లో ఏం చూడొచ్చంటే..

Published on Sat, 06/17/2023 - 13:53

భారత దేశంలో విచిత్రమైన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిని చూసేందుకు జనం ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. వాటిలో ఒకటే ‘బ్లూ సిటీ ఆఫ్‌ ఇండియా’. ఈ సిటీకి ఈ పేరు ఎందుకు వచ్చిందో.. ఇది ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 

మనదేశంలో పింక్‌ సిటీగా పేరొందిన జైపూర్‌.. రాజస్థాన్‌లో ఉందనే విషయం మనందరికీ తెలిసిందే. మరి మన దేశంలో బ్లూ సిటీ అని ఏ ప్రాంతాన్ని అంటారో తెలుసా? భారతదేశం భిన్నత్వానికి పేరొందింది. మన దేశంలో ప్రతీ మతానికి చెందినవారూ ఉన్నారు. వివిధ రాష్ట్రల్లో పలు రకాలైన సంస్కృతులు కనిపిస్తాయి. అలాగే దేశంలోని ప్రతీ పట్టణం ఏదోఒక ప్రత్యేకతను కలిగివుంటుంది.  మన దేశంలో పింక్‌ సిటీ మాదిరిగానే బ్లూ సిటీ కూడా ఉంది. ఉదయం సాయంత్రం వేళ్లలో ఇక్కడి అందాలు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. 

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ను బ్లూ సిటీ అని అంటారు. దేశంలో జోధ్‌పూర్‌ నగరానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది అందాల నగరంగానూ పేరొందింది.  సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో ఈ నగరం అందాలు  మరింత రెట్టింపు అవుతాయి.  జధ్‌పూర్‌ను సూర్యనగరి అని కూడా అంటారు.  దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే జోధ్‌పూర్‌లో సూర్యుడు అత్యధిక సమయం కనిపిస్తాడు. 

బ్లూ సిటీగా పేరొందిన ఈ నగరాన్ని సుమారు 558 ఏళ్ల క్రితం రావ్‌ జోధ్‌ నిర్మాంచాడని చరిత్ర చెబుతోంది. రావ్‌ జోధ్‌.. రాథోడ్‌ సమాజానికి అధ్యక్షునిగా ఉండేవాడు. 1459లో అతను పట్టణాన్ని నిర్మించారు. రావ్‌ జోధ్‌.. జోధ్‌పూర్‌కు 15 రాజు. 

జోధ్‌పూర్‌ను బ్లూ సిటీ అని పిలవడానికి గత కారణం ఇక్కడి ఇళ్ల నిర్మాణం. ఈ పట్టణంలోని చాలా ఇళ్లు నీలిరంగుతో మెరిసిపోతుంటాయి.  భవనాలు కూడా నీలిరంగు రాళ్లలో నిర్మితమై ఉంటాయి.  రాజస్థాన్‌లోని ఈ పట్టణాన్ని మొదట్లో మార్వాడా పేరుతో పిలిచేవారు. 

జోధ్‌పూర్‌లోని అత్యధిక శాతం ఇళ్లు నీలిరంగుతో ఉండటానికి కారణం ఇక్కడి అత్యధిక ఉష్ణోగ్రతలు.  వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇక్కడివారంతా తమ ఇళ్లకు నీలిరంగు పెయింట్‌ వేయిస్తుంటారు.  దూరం నుంచి చూస్తే ఈ పట్టణం నీలిరంగులో కనిపిస్తుంది. 

ఇది కూడాచదవండి: విడాకుల గుడి ఉందని మీకు తెలుసా.. ఇంతకీ ఎక్కడ ఉందంటే..

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)