Breaking News

భద్రతలో మా నిబద్ధతకు రోడ్లే నిదర్శనం 

Published on Mon, 12/08/2025 - 01:51

లేహ్‌: సరిహద్దుల వెంట జాతీయ భద్రతలో తమ ప్రభుత్వ నిబద్ధతకు ఈ నూతన రహదారులే ప్రబల నిదర్శనాలు అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. సరిహద్దు రోడ్లు జాతీయ భద్రతకు జీవనాధారాలని, మెరుగైన అనుసంధానతతో భారీ ప్రయోజనాలు ఒనగూరతాయని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. 

సరిహద్దుల వెంట బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) కొత్తగా నిర్మించిన 125 ప్రాజెక్టులను ఆదివారం ఆయన లేహ్‌లో జరిగిన కార్యక్రమంలో జాతికి అంకితమిచ్చాక ప్రసంగించారు. 

లద్దాఖ్, జమ్మూకశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మిజోరం రాష్ట్రాల్లో మొత్తంగా రూ.5,000 కోట్ల వ్యయంతో సరిహద్దుల వెంట 28 రహదారులు, 93 వంతెనలు, నాలుగు ఇతర నిర్మాణాలను బీఆర్‌వో విజయవంతంగా పూర్తిచేసింది. బీఆర్‌వో చరిత్రలో ఒకేరోజు ఇన్ని ప్రాజెక్టుల ప్రారం¿ోత్సవం జరగడం ఇదే తొలిసారి. ‘‘సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఇవి ప్రబల నిదర్శనాలు. మన సైనికుల శౌర్యం, ధైర్యం మనకు స్ఫూర్తిదాయకం. 

దేశ సేవలో ప్రాణాలను అరి్పంచిన వీరులకు ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును అంకితమిస్తున్నా. అత్యంత అనువైన రహదారులు అనేవి సరిహద్దుల వెంట సైన్యం విజయవంతమైన సైనిక ఆపరేషన్లు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అద్భుతమైన రోడ్ల అనుసంధానతతోనే చక్కటి సైనిక విజయాలను సాధించగలం. ఆత్మనిర్భర్‌ భారత్‌ దార్శనికతకు అనుగుణంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో పాటు షెడ్యూల్‌ కంటే ముందే పూర్తి చేయడం విశేషం’’అని బీఆర్‌ఓ విభాగాన్ని రాజ్‌నాథ్‌ పొగడ్తల్లో ముంచెత్తారు.

 ‘‘సరిహద్దును అనుసంధానం చేయడం, భద్రతను బలోపేతం చేయడమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి చేస్తుందని, ప్రకృతి విపత్తుల సమయాల్లో సహాయక చర్యల వేగాన్ని పెంచుతుంది. సాయుధ బలగాలతోపాటు బీఆర్‌ఓ సిబ్బంది, సరిహద్దు ప్రాంతాల పౌరులు జాతీయ భద్రతలో భాగస్వాములవుతున్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి’’అని ఆయన పిలుపునిచ్చారు. లద్దాఖ్‌లోని దుర్బుక్‌–శ్యోక్‌–దౌలత్‌ బేగ్‌ ఓల్డీ మధ్య 920 మీటర్ల పొడవునా నిర్మించిన సొరంగం ఇంజనీరింగ్‌ అద్భుతం అని కొనియాడారు.   

రూ.1.51 లక్షల కోట్లకు దేశీయ రక్షణ ఉత్పత్తి  
‘‘రక్షణరంగ పరిశ్రమలో భారత్‌ అద్భుతమైన ప్రగతిని కనబరుస్తోంది. 2014లో రూ.46,000 కోట్లుగా ఉన్న రక్షణ ఉత్పత్తుల విలువ ఇప్పుడు రికార్డు స్థాయిలో రూ.1.51 లక్షల కోట్లకు పెరిగింది. రూ. 1,000 కోట్ల కంటే తక్కువగా ఉన్న మన రక్షణ ఎగుమతులు ఇప్పుడు రూ. 24,000 కోట్లకు చేరుకున్నాయి’’అని గుర్తుచేశారు. ‘‘2024–25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో బీఆర్‌ఓ రూ.16,690 కోట్ల వ్యయంతో రోడ్లను నిర్మించింది. 

2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.18,700 కోట్ల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత రెండేళ్లలో బీఆర్‌ఓ 356 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక మైలురాయి. జాతీయ భద్రతలో బీఆర్‌ఓ పాత్రను గుర్తించిన ప్రభుత్వం 2025–26లో బడ్జెట్‌ను రూ.6,500 కోట్ల నుంచి రూ.7,146 కోట్లకు పెంచింది’’అని చెప్పారు.  

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు