Breaking News

సైనికుల మధ్య రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు

Published on Thu, 10/31/2024 - 07:27

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ఈ నేపధ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అస్సాంలోని తేజ్‌పూర్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి కొన్ని ప్రాంతాలలో వివాదాలను పరిష్కరించడానికి భారత్- చైనాలు దౌత్య, సైనిక చర్చలు జరుపుతున్నాయని అన్నారు.

ఇరు దేశాల నిరంతర ప్రయత్నాల తర్వాత  ఏకాభిప్రాయం కుదిరింది. సైనిక బలగాల క్రమశిక్షణ, ధైర్యం వల్లే ఈ విజయం సాధించాం. ఏకాభిప్రాయ ప్రాతిపదికన శాంతి పునరుద్ధరణ ప్రక్రియను కొనసాగిస్తామని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల దృఢమైన నిబద్ధత, అద్భుతమైన ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు.

యువతకు నిజమైన స్పూర్తిదాయకంగా ఉంటూ, అంకితభావంతో మాతృభూమికి సేవ చేస్తున్న సైనికులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని  రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. వైమానిక యోధులు సవాళ్లను ఎదుర్కోవడానికి నిత్యం సిద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. వైమానిక దళ సిబ్బంది అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు.
 

ఇది కూడా చదవండి: స్టార్మర్‌ దీపావళి వేడుకలు

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)