Breaking News

అలరించిన ఏరో ఇండియా

Published on Tue, 02/11/2025 - 05:08

సాక్షి బెంగళూరు: ప్రయాగ్‌­రాజ్‌లో ఆధ్యాత్మిక మహాకుంభమేళ జరుగుతుంటే బెంగళూరు వైమానిక మహాకుంభమేళ జరుగుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. సోమవారం బెంగళూరు సమీపంలోని యలహంక ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో 15వ ఎడిషన్‌ ఏరో ఇండియా ప్రదర్శనను మంత్రి రాజ్‌నాథ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా ఆధ్యాత్మిక శక్తిని, సంస్కృతిని చాటిచెబుతుంటే యలహంక ఎయిర్‌బేస్‌లో ఏరో ఇండియా ప్రదర్శన మన దేశ పరాక్రమాన్ని, రక్షణ సామార్థ్యాలను యావత్తు ప్రపంచానికి చాటిచెబుతోందని తెలిపారు.

ఇక్కడికి తరలివచ్చిన అంతర్జాతీయ భాగస్వామ్య దేశాల ప్రతి­నిధులు ‘ఒక భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే లక్ష్యానికి సాక్ష్యంగా నిలిచారని ప్రశంసించారు. దేశంలో, ముఖ్యంగా వైమానిక రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చు కోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎయిర్‌ షో ఆçహూతులను విశేషంగా అలరించింది. ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ తేజస్‌ యుద్ధ విమానాన్ని నడిపి విన్యాసాలను ప్రారంభించారు.

తేజస్, సుఖోయ్, సూర్యకిరణ్‌ తదితర యుద్ధ విమానాలు చేసిన విన్యాసాలు అందరినీ అలరించాయి. ఇంకా, అత్యాధునిక, 5వ తరం లాక్‌హీడ్‌ మార్టిన్‌ తయారీ అమెరికా యుద్ధ విమానం ఎఫ్‌–35, రష్యాకు చెందిన ఎస్‌యూ–57 ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. అనంతరం, ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫాక్చ­రర్‌(ఓఈఎం)ల సీఈవోలతో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. కాగా, ఈ షో అయిదు రోజులపాటు జరగనుంది.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)