Breaking News

భారత్‌ అమ్ముల పొదిలో ‘అరిఘాత్‌’

Published on Fri, 08/30/2024 - 09:47

సాక్షి, విశాఖపట్నం: భారత్‌ అమ్ముల పొదిలో మరో అణు జలాంతర్గామి ‘అరిఘాత్‌’చేరింది. అరిహంత్‌ క్లాస్‌లో రెండోదైన ఈ అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ను విశాఖ నేవల్‌ డాక్‌యార్డులో గురువారం జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేవీలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన త్రివిధ దళాలు అణుశక్తిని సముపార్జించుకుని మరింత బలోపేతమయ్యాయని తెలిపారు. అణుత్రయాన్ని బలోపేతం చేసుకుంటూ వ్యూహాత్మక సమతుల్యత, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడంలో భారత్‌ కీలకంగా మారుతోందన్నారు.

దేశ భద్రత విషయంలో మోదీ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని, సైనికులకు అత్యాధునిక, నాణ్యమైన ఆయుధాలు, మౌలిక సదుపాయాలు, ఇతర పరికరాల్ని సమకూర్చేందుకు మిషన్‌ మోడ్‌లో పనిచేస్తోందని చెప్పారు. దేశాన్ని అగ్ర రాజ్యాలతో సమానంగా నిలబెట్టిన మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి రాజకీయ సంకల్పాన్ని దేశం ఎప్పటికీ మరవదన్నారు. నేటి భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రక్షణ సహా ప్రతి రంగంలోనూ వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.

అరిఘాత్ ప్రత్యేకతలు..
పొడవు: 111.6 మీటర్లు 
వెడల్పు: 11 మీటర్లు 
డ్రాఫ్ట్‌: 9.5 మీటర్లు 
బరువు: 6,000 టన్నులు  
సామర్థ్యం: ఉపరితలంలో గంటకు 22–24 కి.మీ. (12–15 నాటికల్‌ మైళ్లు).. సాగర గర్భంలో గంటకు 24 నాటికల్‌ మైళ్లు 
నిర్మాణం: విశాఖలోని నేవీ షిప్‌ బిల్డింగ్‌  సెంటర్‌ సెన్సార్‌ సిస్టమ్, ఇతర ప్రత్యేకతలు: సోనార్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థ, టార్పెడోలు, సబ్‌మెరైన్‌ లాంచ్డ్‌ బాలిస్టిక్‌ మిసైల్స్, పంచేంద్రియ యూనిఫైడ్‌ సోనార్‌ సబ్‌మెరైన్, సముద్ర జలాల్లోనూ కమ్యూనికేషన్‌ వ్యవస్థ, కంట్రోల్‌ సిస్టమ్‌. 
మిస్సైల్‌ రేంజ్‌ : 750 కిలోమీటర్లు

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)