Breaking News

పెళ్లిలో చూశాడు.. సినిమాను మించి ట్విస్టులు!

Published on Tue, 01/20/2026 - 10:35

గంగానగర్: రాజస్థాన్‌లో దారుణ ఘటన జరిగింది. పద్నాలుగేళ్ల బాలిక తనతో మాట్లాడటానికి నిరాకరించిందని ఓ ఫొటోగ్రాఫర్‌ ఆమెపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలిక స్కూలుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దాడి చేసిన అనంతరం పరారైన ఓంప్రకాష్ (అలియాస్ జానీ) కోసం మూడురోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం అరెస్ట్‌ చేశారు.

పెళ్లికి ఫోటోగ్రాఫర్‌గా వెళ్లి..
పోలీసు విచారణలో నిందితుడు ఓంప్రకాష్‌ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసుల వెల్లడించిన వివరాలు ప్రకారం.. తను ఒక పెళ్లికి ఫోటోగ్రాఫర్‌గా వెళ్ళినప్పుడు ఆ బాలికను మొదటిసారి చూశానని తెలిపాడు. ఆ తర్వాత అతను బాలికతో మాట్లాడడానికి ప్రయత్నించగా.. ఆమె అతడిని మందలించింది. దీనిని అవమానంగా భావించిన ఓంప్రకాష్, ఎలాగైనా పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. గంగానగర్ జిల్లాలోని సుభాష్ పార్క్ ప్రాంతంలో బాలిక పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండగా, ఓంప్రకాష్ బైక్‌పై వచ్చి ఆమెపై యాసిడ్ బాటిల్‌ను విసిరాడు. ఈ దాడిలో బాలిక దుస్తులు కాలిపోవడంతో పాటు చేతి వేలికి గాయమైంది. బాలికకు తృటిలో ప్రాణాపాయం తప్పింది.

తప్పించుకోవడానికి పక్కా ప్లాన్‌..
పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నిందితుడు పక్కా ప్లాన్‌ వేశాడు. ముఖానికి కర్చీఫ్, తలకు హెల్మెట్ ధరించడమే కాకుండా, తన బైక్ నంబర్ ప్లేట్ కనిపించకుండా బట్టతో కప్పేశాడు. ఈ ఘటన అంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డైనప్పటికీ, నిందితుడు తన ఆనవాళ్లు తెలియకుండా వ్యవహరించాడు. దీంతో యువకుడిని గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ క్రమంలో ఎస్పీ అమృత దుహన్ నిందితుడి సమాచారం ఇచ్చిన వారికి రూ. 25,000 రివార్డు ప్రకటించారు. సాంకేతిక ఆధారాలు, స్థానికుల సాయంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి పోలీసులు నిందితుడిని మార్కెట్ వీధుల్లో ఊరేగించారు.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)