Breaking News

బదిలీ ఉత్తర్వుల్లో బిగ్ ట్విస్ట్.. ఎమ్మెల్యేను ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ..

Published on Sun, 07/12/2026 - 07:15

రాజస్థాన్‌లో ప్రభుత్వ రెవెన్యూ శాఖ విడుదల చేసిన పట్వారీల బదిలీ జాబితాలో జరిగిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బదిలీ కావాల్సిన పట్వారీ పేరు స్థానంలో ఏకంగా అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే పేరు అధికారిక ఉత్తర్వులో కనిపించడంతో అధికారులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనతో ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసే ముందు ఎంత జాగ్రత్త అవసరమో మరోసారి స్పష్టమైంది. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా కావడంతో తీవ్రమైన చర్చ నడుస్తోంది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ సైనికుడు, ప్రస్తుతం పట్వారీగా పనిచేస్తున్న నరేంద్ర సింగ్‌ను బాలోత్రా జిల్లాలోని నవోడా నుంచి డీగ్ జిల్లాలోని సోన్‌గావ్‌కు బదిలీ చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. అయితే బదిలీ ఉత్తర్వులు సిద్ధం చేసే సమయంలో జరిగిన టైపింగ్ లేదా డేటా ఎంట్రీ పొరపాటు కారణంగా నరేంద్ర సింగ్ పేరు స్థానంలో డీగ్–కుమ్హేర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ శైలేశ్ సింగ్ పేరు నమోదైంది. దీంతో అధికారిక ఉత్తర్వు చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఈ తప్పిదం బయటపడిన తర్వాత అసలు బదిలీ కావాల్సిన పట్వారీ నరేంద్ర సింగ్ కొత్త విధుల్లో చేరలేకపోయారు. సవరించిన ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఆయన బదిలీ ప్రక్రియ నిలిచిపోయింది. ఒక చిన్న పరిపాలనా పొరపాటు ఉద్యోగి విధుల్లో చేరడానికే అడ్డంకిగా మారింది. ఈ విషయంపై ఎమ్మెల్యే శైలేశ్ సింగ్ కార్యాలయం స్పందిస్తూ.. ఇది పూర్తిగా సాంకేతిక లేదా టైపింగ్ పొరపాటు మాత్రమేనని, ఎమ్మెల్యేకు ఈ బదిలీలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అధికారులు కూడా తప్పిదాన్ని గుర్తించి సవరించిన ఉత్తర్వులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం.

అయితే ఈ ఘటన ప్రభుత్వ శాఖల పని తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అధికారిక ఉత్తర్వులను విడుదల చేసే ముందు సరైన పరిశీలన జరిగి ఉంటే ఇలాంటి పొరపాటు జరిగేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక పట్వారీ పేరు స్థానంలో ప్రజాప్రతినిధి పేరు అధికారిక పత్రంలో రావడం పరిపాలనా నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)