Breaking News

మధ్యప్రదేశ్‌ సీఎం ఎవరు? రాజస్థాన్‌లో ఏం జరుగుతోంది?

Published on Mon, 12/11/2023 - 07:07

రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. డిసెంబర్ మూడున ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి రాజస్థాన్‌ సీఎం ఎంపిక విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రి పేరును ఆదివారం ప్రకటించారు. విష్ణుదేవ్ సాయికి రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించారు. 

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో ఇంకా సీఎం ఎవరనేది ఖరారు కాలేదు. సోమవారం మధ్యప్రదేశ్‌లో శాసనసభా పక్ష సమావేశం జరగాల్సివుంది. అయితే రాష్ట్రపతి లక్నో పర్యటన కారణంగా ఈ సమావేశం వాయిదా పడింది. ఇప్పుడు ఈ సమావేశం మంగళవారం జరగనుంది. ఇక రాజస్థాన్ రాజకీయ  పరిణామాలను పరిశీలిస్తే మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తన సత్తాను చాటుతున్నారు. 

ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన రాజే జైపూర్‌లోని తన నివాసంలో పలువురు బీజేపీ ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. ఇదేవిధంగా పార్టీకి చెందిన రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి, మాజీ ఎమ్మెల్యే ప్రహ్లాద్ గుంజాల్, మాజీ మంత్రి రాజ్‌పాల్ సింగ్ షెకావత్, మాజీ మంత్రి దేవి సింగ్ భాటీ కూడా రాజేను కలిశారు. మరోవైపు ఎమ్మెల్యేలతో ఆదివారం జరగాల్సిన పరిశీలకుల సమావేశం కూడా వాయిదా పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమ, మంగళవారాల్లో లక్నోలో  పర్యటనలో ఉండనున్నారు. రాష్ట్రపతి పర్యటన కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్  పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటన కారణంగానే శాసనసభా పక్ష సమావేశం వాయిదా పడిందని తెలుస్తోంది.

వసుంధర రాజేను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే ప్రహ్లాద్ గుంజాల్ కూడా  ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజస్థాన్ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, అటువంటి పరిస్థితిలో అనుభవమున్న నేత మాత్రమే చక్కదిద్దగలరని.. అందుకు వసుంధర రాజే మాత్రమే సరైనవారని పేర్కొన్నారు. కాగా ఆదివారం జైపూర్ చేరుకున్న కేంద్ర సహాయ మంత్రి అశ్విని చౌబే మీడియాతో మాట్లాడుతూ రాజస్థాన్‌ సీంఎం ఎంపికకు సంబంధించి త్వరలోనే పార్టీ హైకమాండ్, రాజస్థాన్ ఎమ్మెల్యేలు తగిన నిర్ణయం తీసుకుంటారన్నారు. 
ఇది కూడా చదవండి: 19న ‘ఇండియా’ భేటీ

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?