Breaking News

రాజస్తాన్‌లోని కాంగ్రెస్‌కు షాక్‌ మీద షాక్‌..కలకలం రేపిన వ్యక్తి..

Published on Fri, 04/21/2023 - 20:51

రాజస్తాన్‌లో కాంగ్రెస్‌కి ఊహించని విధంగా షాక్‌ మీద షాక్‌ తగులుతూనే ఉంది. అక్కడ కాంగ్రెస్‌లో అంతర్గత పోరుతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి ఆశోక్‌ గెహ్లాట్‌కి వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ నిరసకు దిగిన ఘటన మరువుక మునుపే మరో గట్టి దెబ్బను ఎదుర్కొంటోంది కాంగ్రెస్‌. బీజేపీ కాంగ్రెస్‌పై వరుస అవినీతి ఆరోపణల చేస్తున్న తరుణంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తోంది.

జైపూర్‌లోని 38 ఏళ్ల రామ్‌ ప్రసాద్‌ మీనా అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆ వ్యక్తి ఓ హోటల్‌ యజమానితో భూవివాదంలో చిక్కుకున్నాడు. ఈ మేరకు తన స్థలం నుంచి తనను ఖాళీ చేయమంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ మంత్రి మహేశ్‌ జోషి తోపాటు మరికొందరూ వ్యక్తులపై ఆరోపణలు చేస్తూ ఓ వీడియో సందేశాన్ని రికార్డు చేశాడు బాధితుడు. వాస్తవానికి మీనా అనే వ్యక్తి దశాబ్దానికి పైగా ఆలయ ట్రస్ట్‌కి చెందని భూమిలోనే నివశిస్తున్నాడు. ఆ వీడియోలో.. "తాను కేబినేట్‌ మంత్రి మహేష్‌ జోషి, అతని సహచరులు కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నా. వారు నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో వేధించారు. వేరే మార్గం లేక ఇలా చేస్తున్నా". అని పేర్కొన్నాడు బాధితుడు మీనా.

అది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇదే అదనుగా బీజేపీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ. కాంగ్రెస్‌పై విరుచుకుపడింది. జోషి రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. అంతేగాక బాధితుడు వర్గానికి చెందని బీజేపీ రాజ్యసభ్య సభ్యుడు కిరోరి లాల్‌ మీనా చనిపోయిన వ్యక్తికి మద్దతు ఇస్తూ..డిమాండ్‌ నెరవేరే వరకు మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించమని చెప్పారు. కాగా, సచిన్‌పైలట్‌ బాధితుడి కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ.. సదరు రాజ్యసభ​ సభ్యుడు కిరోరి లాల్‌ మీనాతో కలిసి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వాన్ని ఈఘటన ఇరకాటంలో పడేసిందనే చెప్పాలి.

(చదవండి: 'మహమ్మారి ఇంకా ముగియలేదు'..అప్రమత్తంగా ఉండండని కేంద్రం లేఖ)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)