Breaking News

కాంగ్రెస్‌ గెలిస్తే సీఎం ఎవరు? ఓడితే బాధ్యులెవరు?

Published on Sat, 12/02/2023 - 09:09

రాజస్థాన్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు గందరగోళానికి దారితీస్తున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు తేలగా, కొన్నింటిలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అయితే ఇప్పుడు గెలుపు ఓటములు రెండూ కాంగ్రెస్‌కు కొత్త సవాళ్లను సృష్టించనున్నాయి. 

గత కొన్నేళ్లుగా రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ నేతలు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. ఈ పోరుకు పునాది సీఎం కుర్చీ. ప్రస్తుత ఎగ్జిట్ పోల్ అంచనాలు ఈ పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. రాజస్థాన్‌లో ఒకవేళ కాంగ్రెస్ గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మరోమారు ముఖ్యమంత్రి పదవి కోసం యుద్ధం మొదలుకానున్నదని తెలుస్తోంది. దీనిని చూస్తుంటే మరోసారి 2018 ఎన్నికల ఫలితాల తరహా పరిస్థితి ఏర్పడవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. 

2018లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలుపొందినప్పుడు పార్టీలోని ఒక వర్గం సచిన్ పైలట్‌కు మద్దతు ఇచ్చింది. అయితే పార్టీలో అశోక్ గెహ్లాట్ సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని ఆయనకు  మరోమారు సీఎం అయ్యే అవకాశం కల్పించారు. ఈ నేపధ్యంలో ఆయన రెండున్నరేళ్ల పాటు సీఎంగా ఉండాలనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చనే వార్తలు కూడా వినిపించాయి. ఆ దిరిమిలా 2020లో సచిన్ పైలట్ తనను ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చి, తిరుగుబాటుకు దిగారు. ఈ నేపధ్యంలో పైలెట్‌ డిప్యూటీ సీఎం పదవిని కోల్పోవలసి వచ్చింది. 

అయితే ఇప్పుడు ఎన్నికల వేళ గెహ్లాట్‌, పైలట్‌ల మధ్య టెన్షన్ కాస్త తగ్గినట్లు కనిపించినా, ఫలితాల వెల్లడి తర్వాత మళ్లీ సమస్యలు తలెత్తడం ఖాయం అని పలువురు అంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ ఓటమిపాలైనా  గెహ్లాట్-పైలట్ అంశం కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పిగా మారనుంది. అప్పుడు ఆటంతా ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య తిరుగుతుంది. అలాంటి పరిస్థితిలో వీరిద్దరి మధ్య సంబంధాలు చెడిపోతే.. పార్టీ మళ్లీ వారిని బుజ్జగించే పని చేయాల్సి వస్తుంది. రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్  విషయానికొస్తే కాంగ్రెస్‌కు 86 నుంచి 106 సీట్లు వస్తాయని, బీజేపీకి 80 నుంచి 100 సీట్లు వస్తాయని పలు మీడియా సంస్థలు అంచనా వేశాయి.  
ఇది కూడా చదవండి: ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)