Breaking News

టీచర్‌ దెబ్బలకు విద్యార్థి మృతి.. సీఎం సంచలన వ్యాఖ్యలు

Published on Mon, 08/15/2022 - 12:58

ఉదయపూర్‌: దేశంలో కుల వివక్ష వికృతరూపం ఎక్కడో ఒకచోట బట్టబయలువుతూనే ఉంది. తాజాగా రాజస్తాన్‌లోని జలోర్‌ జిల్లాలోని సురానా గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చెయిల్‌ సింగ్‌ అనే టీచర్‌ తన కోసం ప్రత్యేకంగా ఉంచుకున్న నీళ్లకుండను ఇంద్రకుమార్‌ మేఘవాలా దళిత విద్యార్థి తాకాడు. దీంతో తొమ్మిదేళ్ల ఆ బాలుడిని విచక్షణారహితంగా చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ శనివారం చనిపోయిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటన జూలైన జరుగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

అయితే, ఈ ఘటనపై రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఘటనలు ప్రతీ రోజు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయన్నారు. టీవీలో, పత్రికల్లో వీటిని మనం చూస్తూనే ఉంటామని చెప్పారు. బాలుడిని కొట్టడాన్ని తాను కూడా తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పిన సీఎం.. ఇలాంటి ఘటన ఎక్కడ జరిగినా నేరమని అన్నారు. కానీ, ఇలాంటి ఘటనలను కూడా ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా చూడటం విచారకరమని గెహ్లాట్‌ ఆవేదన వ్యక్తపరిచారు. 

కాగా, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నామని సీఎం తెలిపారు. బాలుడిని కొట్టిన టీచర్‌ చైల్‌ సింగ్‌(40)ను అరెస్ట్‌ చేసి సమగ్ర విచారణకు ఆదేశించినట్టు స్పష్టం చేశారు. ఇంతకంటే ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు వేరే పనిలేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రతీ విషయాన్ని తప్పుదోవ పట్టించి ప్రజలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. 

ఇది కూడా చదవండి: స్వాతంత్ర్య వేడుకల వేళ సోనియా సీరియస్‌

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)