Breaking News

‘హనీమూన్‌’ కేసు: ‘కొండ మీంచి తోసేస్తా’.. సోనమ్‌ ‘ప్లాన్‌ బీ’

Published on Wed, 06/11/2025 - 13:04

న్యూఢిల్లీ: మేఘాలయలో అదృశ్యమైన కొత్త జంట ఉదంతం లెక్కలేన్ని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్‌ చెబుతున్న విషయాలు పోలీసులను సైతం విస్తుపోయేలా చేస్తున్నాయి.  సోనమ్ తన ప్రేమికుడు రాజ్ కుష్వాహాతో కలిసి ఈ హత్యను ముందుగానే ప్లాన్ చేసిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోనమ్ తన భర్తను ఈశాన్య రాష్ట్రానికి తీసుకువెళ్లి అంతమొందించాలని ప్లాన్‌ చేసిందని పోలీసులు తెలిపారు.

కామాఖ్య ఆలయాన్ని సందర్శించాలంటూ..
సోనమ్ ముందుగా కామాఖ్య ఆలయాన్ని సందర్శించేందుకు వెళదామని  రాజా రఘువంశీని ఒప్పించిదని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.  రాజాను తొలుత గౌహతికి, తరువాత మేఘాలయకు తీకువెళ్లాలని సోనమ్‌ ప్లాన్‌ చేసింది. వివాహం తర్వాత ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చినప్పుడు రాజా రఘువంశీ హత్యకు ప్లాన్‌ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివాహం జరిగిన నాలుగు రోజుల తర్వాత మే 15న సోనమ్‌ తన పుట్టింటికి వచ్చింది. అక్కడ తన ప్రియుడు రాజ్‌కు పోన్‌ చేసి, ‘ప్రణాళిక’ను సిద్ధం  చేసిందని పోలీసులు తెలిపారు. ఇండోర్‌లో మేఘాలయ పోలీసులు నిందితుడిని ప్రాథమికంగా విచారించినప్పుడు ఈ ఉదంతంలో సోనమ్ ప్రమేయం ఏ మేరకు ఉందనేది వెల్లడయ్యింది.

భర్త రాజా రఘువంశీని హత్య చేయించినట్టు ఒప్పు కున్న సోనమ్

‘అందరినీ ఉరి తీయాలి’
నిందితులు విశాల్, ఆనంద్, ఆకాష్‌లు రాజా రఘువంశీని చంపడంలో విఫలమైతే, తానే ఫోటో తీయాలనే నెపంతో, భర్తను కొండ అంచునకు తీసుకెళ్లి, అక్కడి నుంచి అతనిని తోసేస్తానని సోనమ్  తన ప్రియునితో చెప్పినట్లు పోలీసుల విచారణలో బహిర్గతమయ్యింది. ఒకవేళ నేరం బయటపడితే సోనమ్‌, రాజాలు నేపాల్‌కు పారిపోయేందుకు కూడా ప్లాన్‌ చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా రాజా రఘువంశీ తండ్రి మీడియాతో మాట్లాడుతూ, తన కుమారుని హత్యలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ ఉరితీయాలన్నారు. వారిలో సోనమ్‌ కుటుంబానికి చెందిన ఫ్యాక్టరీలోని వారు కూడా ఉన్నారన్నారు. సోనమ్ కుటుంబాన్ని సమాజం నుంచి బహిష్కరించాలని కూడా ఆయన కోరారు. 

ఇది కూడా చదవండి: ‘హనీమూన్‌’ కేసు: రాజాను ‘మాయం’ చేసి.. సోనమ్‌ పరారైందిలా..

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)