Breaking News

పట్టాలు తప్పించే కుట్ర.. ఆ ముగ్గురు రైల్వే ఉద్యోగుల పనే

Published on Tue, 09/24/2024 - 08:48

సూరత్‌: ఇటీవలికాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా గుజరాత్‌లో జరిగిన ఇటువంటి దుశ్చర్య వెనుక రైల్వే ఉద్యోగులే ఉన్నారని తెలియడంతో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఉన్నతాధికారులు, పోలీసులు కంగుతిన్నారు.

గుజరాత్‌లోని సూరత్‌లో కీమ్-కొసాంబ మధ్య రైలును పట్టాలు తప్పించేందుకు ఇటీవల కుట్ర జరిగింది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రైల్వే ఉద్యోగి సుభాష్ పొద్దార్ ఈ కేసులో నిందితునిగా గుర్తించింది. సుభాష్‌ తన ప్రమోషన్ కోసం రైలును పట్టాలను తప్పించాలని ప్లాన్ చేశాడని, ట్రాక్‌లపై ఉన్న ఫిష్ ప్లేట్, కీలను అతనే తొలగించాడని ఎన్‌ఐఏ అధికారులు కనుగొన్నారు.  ట్రాక్‌ల నుండి 71 ఫిష్ ప్లేట్లు, కీలను సాధారణ వ్యక్తి సులభంగా తొలగించలేడు.

ఎన్‌ఐఏకు తొలుత ఘటనా స్థలంలో ఎలాంటి పాదముద్రలు లేదా ఇతర అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. అయితే రైలు పట్టాలు తప్పించేందుకు కుట్ర జరిగిందని ముందుగా రైల్వే ఉన్నతాధికారులకు చెప్పిన  రైల్వే ఉద్యోగి సుభాష్ పొద్దార్‌ను ఎన్ఐఏ అధికారులు అనుమానించారు. ఈ కేసులో సుభాష్ కుమార్ కృష్ణదేవ్ పోద్దార్, మనీష్ కుమార్ సుర్దేవ్ మిస్త్రీ,  శుభం శ్రీజైప్రకాష్‌  జైస్వాల్‌ అనే ముగ్గురు రైల్వే ఉద్యోగులను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో ఇద్దరు బీహార్‌కు చెందిన వారు కాగా, ఒకరు యూపీకి చెందిన ఉద్యోగి. రైల్వేలో పనిచేస్తున్న వీరు పదోన్నతి పొందేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అధికారులు విచారణలో అంగీకరించారు.

రైలు ప్రమాదాలను నివారించే రైల్వే ఉద్యోగులకు రివార్డులతో పాటు ప్రమోషన్‌ కూడా వస్తుందని, ఈ ఆశతోనే తాము ఈ చర్యకు పాల్పడినట్లు నిందితులు అధికారులకు తెలిపారు. ఈ రైల్వే ఉద్యోగులే స్వయంగా రైలు పట్టాలకున్న   71 ఫిష్‌ ప్లేట్లు, కీలను తొలగించి, ఆ  పక్కనే ఉంచారు. తరువాత రైల్వే ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తున్నట్లు, ఈ విషయాన్ని వారికి తెలిపారు. దీంతో అధికారులు రైల్వే ఉద్యోగి సుభాష్‌ పోద్దార్‌ను మెచ్చుకున్నారు. అయితే ఎన్‌ఐఏ విచారణలో ఈ ముగ్గురు రైల్వే ఉద్యోగులు తప్పుడు కథనాన్ని అల్లి ఉన్నతాధికారులను తప్పుదారి పట్టించారని తేలింది. పోలీసులు ఈ ముగ్గురినీ అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: కోటక్‌ మహేంద్ర బ్యాంక్‌ చైర్మన్‌పై ఫోర్జరీ కేసు..

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు