Breaking News

25 గ్యాంగ్‌స్టర్ స్థావరాలపై 380 మంది పోలీసుల భారీ దాడులు

Published on Mon, 09/15/2025 - 12:57

న్యూఢిల్లీ: ప్రముఖ గ్యాంగ్‌స్టర్ సిండికేట్‌ల రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఢిల్లీ పోలీసులు ఢిల్లీతోపాటు హర్యానా అంతటా 25 ప్రదేశాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఢిల్లీలోని ద్వారక డీసీపీ నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో  380 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇది ఈ ఏడాది ఈ ప్రాంతంలో జరిగిన గ్యాంగ్‌స్టర్‌ వ్యతిరేక ఆపరేషన్లలో ఒకటిగా తెలుస్తోంది.

25 గ్యాంగస్టర్‌ స్థావరాలపై జరిగిన దాడుల్లో ఢిల్లీలో 19, హర్యానా, ఎన్సీఆర్‌లో ఆరు ఉన్నాయి. దోపిడీలు, హత్యలు, ఆయుధ అక్రమ రవాణాతో సహా పలు హై ప్రొఫైల్ నేరాలకు పాల్పడిన కపిల్ సంగ్వాన్ అలియాస్ నందు, విక్కీ టక్కర్‌ల క్రిమినల్ నెట్‌వర్క్‌లపై దాడులు జరిగాయి. ఈ దాడులలో పోలీసులు పెద్ద మొత్తంలో నగదు, ఆయుధాలు,పలు విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

సుమారు రూ. 50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 8 పిస్టల్స్, 29 లైవ్ కార్ట్రిడ్జ్‌లు, మూడు మ్యాగజైన్‌లు, బుల్లెట్‌ప్రూఫ్ టయోటా ఫార్చ్యూనర్, ఆడి కారు, 14 హై-ఎండ్ లగ్జరీ గడియారాలు, ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్‌లు, నగదు లెక్కింపు యంత్రాలు, వాకీ-టాకీ సెట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో పోలీసులు 26 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు కీలక గ్యాంగ్‌స్టర్లను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితులందరూ నందు, విక్కీ టక్కర్ ముఠాతో సన్నిహిత సంబంధాలు కలిగినవారు.

అర్టెస్టయిన నిందితులు
పవన్ అలియాస్ ప్రిన్స్ (18): రాజ్‌మందిర్ స్టోర్,  చావ్లా కాల్పుల కేసుల్లో పాల్గొన్న నందు ముఠాకు చెందిన షూటర్.

హిమాన్షు అలియాస్ మచ్చి (24): విక్కీ టక్కర్ గ్యాంగ్ సభ్యుడు. ఏడు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నాడు.

ప్రశాంత్: నందు గ్యాంగ్ షూటర్. ఇతనిపై 11 కేసులు నమోదయ్యాయి.

రాహుల్ దివాకర్ అలియాస్ మన్‌ప్రీత్ (25): విక్కీ టక్కర్ గ్యాంగ్‌కు చెందినవాడు. 20 ఎఫ్‌ఐఆర్‌లలో ఇతని పేరు ఉంది.

అంకిత్ ధింగ్రా అలియాస్ నోని (34): నందు గ్యాంగ్‌తో సంబంధం ఉన్నాడు. ఇతనిపై 10 కేసులున్నాయి.

ప్రవీణ్ అలియాస్ డాక్టర్: ఇతని పేరు మీద 25కు పైగా క్రిమినల్ కేసులున్నాయి.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)