Breaking News

రాహుల్‌ గాంధీపై ట్రోలింగ్‌.. కారణం ఏంటంటే..

Published on Fri, 04/05/2024 - 12:16

న్యూఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ వెల్లువెత్తుతోంది. పార్లమెంట్ హౌస్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో తీసిన ఓ ఫోటోకు రాహుల్‌ గాంధీ ఇచ్చిన పోజు, వేషధారణపై నెటిజన్ల నుంచి ట్రోలింగ్‌ వ్యక్తమవుతోంది.

కొత్తగా రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన సోనియా గాంధీతో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ దిగిన ఫొటోను ఉప రాష్ట్రపతి అధికారిక ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఖాతాలో షేర్‌ చేశారు. ఈ ఫొటోలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, రాజ్యసభలో సభా నాయకుడు పీయూష్ గోయల్‌తోపాటు సోనియాగాంధీ కుటుంబ సభ్యులుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా ఉన్నారు.

 

సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్లమెంట్‌ హౌస్‌లో తీసిన ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్దిసేపటికే నెటిజన్లు రాహుల్ గాంధీని ట్రోల్‌ చేయడం మొదలు పెట్టారు. అధికారిక ఫొటోకు ఆయన ఇచ్చిన పోజు నిర్లక్ష్యంగా ఉందని, వేషధారణ హుందాగా లేదని చాలా మంది విమర్శిస్తున్నారు. అయితే కొంత మంది రాహుల్‌ గాంధీకి కూడా మద్దతుగా నిలుస్తున్నారు. ఉప రాష్ట్రపతి ట్విటర్ హ్యాండిల్ హ్యాండ్లర్ కావాలనే ఇలాంటి ఫొటోను ఎంచుకుని పోస్ట్ చేశారని కొంతమంది ఆరోపిస్తున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)