Breaking News

Rahul Gandhi: సోదరితో పాటు సూరత్‌ కోర్టుకు..

Published on Mon, 04/03/2023 - 09:36

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేడు(సోమవారం) సూరత్‌(గుజరాత్‌) కోర్టును ఆశ్రయించనున్నారు. 2019 నాటి పరువు నష్టం దావా కేసులో సూరత్‌ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ శిక్షను సవాల్‌ చేస్తూ అప్పీల్‌కు వెళ్లేందుకు ఆయనకు కోర్టు నెల వ్యవధి ఇవ్వగా.. ఇవాళ ఆయన అప్పీల్‌కు వెళ్లనున్నారు. 

సూరత్‌ సెషన్స్‌ కోర్టులో ఇవాళ రాహుల్‌ అభ్యర్థన పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. పరువునష్టం కేసులో మెజిస్ట్రేట్‌ విధించిన శిక్షను పక్కనపెట్టాలంటూ ఆయన అప్పీల్‌ చేయనున్నారు. అంతేకాదు.. తన శిక్షపై తాత్కాలిక స్టే ఇవ్వాలని, తద్వారా లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించుకోగలిగే అవకాశం తనకు దొరుకుతుందని ఆయన పిటిషన్‌లో కోరే అవకాశం కనిపిస్తోంది. 

ఈ మేరకు సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, పలువురు కాంగ్రెస్‌ నేలతో కలిసి ఆయన సూరత్‌ కోర్టుకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.  అంతకు ముందు ఆదివారం తన తల్లి సోనియా గాంధీని కలిసి కాసేపు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు కూడా.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)