బీజేపీ దళిత వ్యతిరేకి

Published on Sat, 03/01/2025 - 06:21

న్యూఢిల్లీ: షెడ్యూల్డ్‌ కులాల జాతీయ కమిషన్‌లో కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండడం పట్ల కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ అసంతృప్తి వ్యక్తంచేశారు. దళితుల హక్కులు, ప్రయోజనాలను కాపాడే బాధ్యత కలిగిన కమిషన్‌లో ఖాళీలను భర్తీ చేయకపోవడం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రెండు కీలక పోస్టులు ఏడాది కాలంగా ఖాళీగా ఉంటున్నప్పటికీ పట్టించుకోవడం లేదంటే అధికార బీజేపీ దళిత వ్యతిరేక వైఖరిని అర్థం చేసుకోవచ్చని అన్నారు. 

దళితుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్‌ శుక్రవారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. షెడ్యూల్డ్‌ కులాల జాతీయ కమిషన్‌ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని గుర్తుచేశారు. కమిషన్‌ను ఉద్దేశపూర్వకంగా బలహీనపర్చడం రాజ్యాంగంపై, దళితుల సామాజిక హక్కులపై ప్రత్యక్షంగా దాడి చేయడమే అవుతుందని తేల్చిచెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇకనైనా మేల్కొనాలని, కమిషన్‌లో ఖాళీలను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కమిషన్‌ అచేతనంగా మిగిలిపోతే దళితులు సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తంచేశారు. వారి ఫిర్యాదులపై ఎవరు స్పందించారని ప్రశ్నించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)