Breaking News

త్యాగధనులను కేంద్రం అవమానిస్తోంది

Published on Fri, 06/05/2026 - 01:37

డెహ్రాడూన్‌: రాష్ట్ర ఆవిర్భావం కోసం ఉత్తరాఖండ్‌ ప్రజలు చేసిన త్యాగాలను, పడిన కష్టాలకు మోదీ సర్కార్‌ పూచికపుల్ల అంత విలువ కూడా ఇవ్వట్లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ఉత్తరాఖండ్‌లో పాలనను మోదీ ప్రభుత్వం రిమోట్‌ కంట్రోల్‌ మాదిరి పరిపాలిస్తోందని రాహుల్‌ ధ్వజమెత్తారు. 

శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాహుల్‌ ఆల్మోరా, పౌడీ గడ్వాల్‌లో పర్యటించాలని భావించారు. అయితే ఉధమ్‌సింగ్‌ నగర్‌ జిల్లాలోని పంత్‌నగర్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి రాహుల్‌తో బయల్దేరిన హెలికాప్టర్‌ భారీ వర్షం, అననుకూల వాతావరణంతో తిరిగి ఎయిర్‌పోర్ట్‌కే చేరుకుంది. దీంతో రాహుల్‌ రెండు ర్యాలీల్లో వర్చువల్‌గా ప్రసంగించారు. 

‘‘ఎంతో చారిత్రక అవసరంతో ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్ర సాధన కోసం ఇక్కడి ప్రజలు ఎంతో కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలుచేశారు. మీరు సాధించిన ఈ రాష్ట్రాన్ని మీరు కాకుండా వేరే వాళ్లు(మోదీ) రిమోట్‌ కంట్రోల్‌ పాలిస్తుండటం దురదృష్టకరం. స్థానికుల ప్రయోజనాలను పక్కనబెట్టి రాష్ట్రేతరులు ఇక్కడి సహజ సంపదను కొల్లగొడుతున్నారు’’ అని అన్నారు. కేంద్రం అమలుచేస్తున్న అగ్నిపథ్‌ పథకంపై రాహుల్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. పౌడీ గడ్వాల్‌లో మాజీ సైనికుల ర్యాలీలో రాహుల్‌ వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ జవాన్లతో భారత్‌కు శాశ్వత పవిత్రబంధం ఉండేది. 

యువత జవాన్లుగా శాశ్వతంగా దేశసేవలో నిమగ్నమయ్యేవారు. దేశం కోసం సరిహద్దుల పరిరక్షణ కోసం జవాన్లు తమ రక్తాన్ని ధారపోస్తారు. అవసరమైతే ప్రాణాలను అర్పిస్తారు. అలాంటి వాళ్లకు, వాళ్ల కుటుంబాలకు భారతసర్కార్‌ భరోసా ఇస్తుంది. ఇలాంటి జవాన్లతో ఉండే పవిత్రబంధాన్ని ‘అగ్నిపథ్‌’ పథకం తెచ్చి ప్రధాని మోదీ సర్కార్‌ తుంచేసింది. యువతను త్రివిధ దళాల్లోకి అగ్నివీర్‌లుగా తాత్కాలిక ప్రాతిపదికన తీసుకుంటూ 2022లో అగ్నిపథ్‌ పథకం తెచ్చారు. మేం కేంద్రంలో అధికారంలోకి రాగానే ఈ అసంబద్ధ అగ్నిపథ్‌ పథకాన్ని రద్దుచేస్తాం’’ అని రాహుల్‌ చెప్పారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)