Breaking News

ప్రమిదల తయారీలో రాహుల్‌ గాంధీ...

Published on Sat, 11/02/2024 - 05:47

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ మరోమారు వృత్తి పనివారల ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన సుమారు 9 నిమిషాల వీడియోను శుక్రవారం ‘ఎక్స్‌’లో విడుదల చేశారు. ఢిల్లీలో మట్టి ప్రమిదలను తయారు చేసే మహిళ ఇంటికి రాహుల్‌ గాంధీ వెళ్లారు. ప్రమిదలను సొంతంగా తయారు చేసేందుకు ప్రయతి్నంచారు. వీటిని తన తల్లి సోనియా గాం«దీ, సోదరి ప్రియాంకా గాంధీ వాద్రాకు ఇస్తానన్నారు. 

‘ప్రత్యేకమైన వ్యక్తులతో గుర్తుండిపోయే దీపావళి ఇది. దీపావళి నాడు పెయింటర్‌ సోదరులతో, కుమ్మరి వృత్తి పని వారి కుటుంబంతో పనిచేస్తూ గడిపాను. వారి వృత్తి పనిని దగ్గర్నుంచి గమనించాను. వారి పనితనాన్ని అలవాటు చేసుకునేందుకు ప్రయతి్నంచాను. వారి కష్టనష్టాలను అర్థం చేసుకున్నాను. మనం కుటుంబంతో కలిసి పండగలను సంతోషంతో జరుపుకుంటాం. 

వారు మాత్రం ఎంతోకొంత డబ్బు సంపాదించుకునేందుకు సొంతింటిని, కుటుంబాన్ని, సొంతూరిని, నగరాన్ని మర్చిపోతున్నారు’అని అనంతరం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ‘మట్టిలోనే వారు సంతోషం వెదుక్కుంటున్నారు. ఇతరుల జీవితాల్లో పండుగ వెలుగుల కోసం ప్రయత్నిస్తూ..తమ జీవితాల్లో వెలుగులు నింపుకోగలుతున్నారా? ఇళ్లను నిర్మించే వీరికి సొంతిల్లు కూడా ఉండటం గగనంగా మారింది’అని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమకు, నైపుణ్యానికి తగిన ప్రతిఫలం, ఆత్మగౌరవాన్ని అందించే వ్యవస్థను మనం తయారు చేసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఈ దీపావళి అందరికీ సుఖ సంతోషాలను ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు.

10, జన్‌పథ్‌ బంగ్లా అంటే పెద్దగా ఇష్టం లేదు
ఢిల్లీలోని ల్యుటెన్స్‌ ప్రాంతంలో ఉన్న 10, జన్‌పథ్‌ బంగ్లా అంటే తనకు పెద్దగా ఇష్టం లేదని రాహుల్‌ గాంధీ చెప్పారు. తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో హత్యకు గురైన సమయంలో ఈ బంగ్లాలోనే ఉన్నారని, అందుకే అంతగా ఇష్టం లేదని ఆయన గురువారం చెప్పారు. జన్‌పథ్‌ బంగ్లాకు రంగులు వేసే కారి్మకులతో కలిసి పనిచేశారు. ఈ సందర్భంగా సోదరి ప్రియాంకా గాంధీ కుమారుడు, మేనల్లుడు రైహాన్‌ రాజీవ్‌ వాద్రాతో ఈ మేరకు చేసిన సంభాషణ వీడియోను ఆయన విడుదల చేశారు. రాహుల్‌ గాంధీ చిన్నప్పటి నుంచి 10, జన్‌పథ్‌ బంగ్లాలోనే గడిపారు. రాజీవ్‌ గాంధీ హత్యానంతరం తల్లి సోనియా గాం«దీకి ఈ భవనాన్ని కేటాయించారు. రాహుల్‌ ఎంపీ అయ్యాక తుగ్లక్‌ లేన్‌లోని 12వ నంబర్‌ బంగ్లాకు మకాం మార్చారు. 2023లో పరువునష్టం కేసులో అనర్హత వేటు పడటంతో తల్లి ఉండే జన్‌పథ్‌ బంగ్లాకు మారారు. అనర్హత వేటు తొలిగి, మళ్లీ ఎంపీ అయ్యాక కూడా రాహుల్‌ ఇక్కడే ఉంటున్నారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)