Breaking News

దేశాన్ని విడదీయడానికి కూడా వెనుకాడరు: రాహుల్‌పై కంగన మండిపాటు

Published on Sat, 09/21/2024 - 14:17

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై బాలీవుడ్‌ నటి, మండి లోక్‌సభ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్‌ అధికారం కోసం దేశాన్ని విడదీయడానికి కూడా వెనుకాడరని వ్యాఖ్యానించారు.

భారత్‌లో కొన్ని మతాలు, భాషలు మిగిలిన వాటికంటే తక్కువనే భావన ఆరెస్సెస్‌లో ఉందని అమెరికా పర్యటనలో రాహుల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై కంగన తాజాగా స్పందిస్తూ కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మన దేశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ప్రజలందరికీ తెలుసని అన్నారు అధికారం కోసం దేశాన్ని విడదీయడానికి కూడా ఆయన వెనుకాడరని విమర్శలు గుప్పించారు.

అనంతరం తన ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదల  వాయిదాపై కంగనా స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ చిత్రాన్ని నేను ఏవిధంగా తెరకెక్కించానో నాకు తెలుసు. చిత్రబృందం నుంచి నాకు ఎలాంటి సపోర్ట్‌ లేదు. ఇదొక భారీ బడ్జెట్‌ మూవీ. జీ, కొందరు వ్యక్తుల భాగస్వామ్యంతో దీనిని నిర్మించాను. ఈ సినిమా రిలీజ్‌ ఆలస్యమవుతున్నకొద్దీ మేము ఎన్నో నష్టాలు ఎదుర్కొంటున్నాం. మా చిత్రాన్ని వీలైనంత త్వరగా విడుదల చేయాల్సిన బాధ్యత సెన్సార్‌పై ఉంది’’ అని ఆమె చెప్పారు.

Videos

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు