Breaking News

Bihar Election: లాలూకు రాహుల్‌ ఫోన్‌.. సీట్ల ఒప్పందంపై మంతనాలు

Published on Thu, 10/16/2025 - 15:35

న్యూఢిల్లీ: బీహార్‌లో నవంబర్‌లో జరగనున్న ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో రాజకీయపార్టీల్లో సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో ప్రతిపక్ష కూటమిలో సీట్ల కేటాయింపు చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. దీనిని పరిష్కరించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గురువారం రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో నేరుగా మాట్లాడారని పార్టీ వర్గాలు తెలిపాయి. పోటీ విషయంలో ఒక ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఇరు పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని సమాచారం.

బీహార్‌ ఎన్నికలకు సంబంధించి మొదటి దశ నామినేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ కీలక మిత్రపక్షాలైన ఆర్జేడీ, కాంగ్రెస్‌ మధ్య ఇంతవరకూ సీట్ల కేటాయింపు విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. తొలుత ఆర్జేడీ తన మిత్రపక్షం కాంగ్రెస్‌కు 52 సీట్లు ఇచ్చింది. అయితే దానిని కాంగ్రెస్‌ తిరస్కరించింది. కనీసం 60 నియోజకవర్గాలు కావాలని పట్టుపట్టింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నేతలు- ఆర్జేడీ మధ్య చర్చలు నిలిచిపోయినట్లు సమాచారం.  దీంతో రెండు పార్టీల జాతీయ నాయకత్వం సీట్ల ప​్రతిష్టంభనను తొలగించేందుకు రంగంలోకి దిగింది.  

అయితే ఆర్జేడీ నేతలు కాంగ్రెస్ 61 సీట్ల డిమాండ్‌ను నెరవేర్చడానికి ముందుకు వచ్చినప్పటికీ, కాంగ్రెస్ పట్టుబట్టిన కొన్ని కీలక నియోజకవర్గాలపై విభేదాలు మొదలయ్యాయని సమాచారం. నర్కటియగంజ్, వాసాలిగంజ్‌, కహల్గావ్  స్థానాలలో పోటీ విషయంలో ఆర్జేడీ, కాంగ్రెస్‌ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. చైన్పూర్, బచ్వారాలలో ఇదే పరిస్థితి నెలకొన్నదని సమాచారం. కాగా రాహుల్ గాంధీ తాను చేపట్టిన ఓటరు అధికార్ యాత్ర రాష్ట్రంలో తమకు అవకాశాలను పెంచుతుందని నమ్ముతూ  మరిన్ని సీట్లు కోరుతున్నారని తెలుస్తోంది.  

మీడియాకు ‍ప్రాధమికంగా తెలిసిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ 61 సీట్లతో సరిపెట్టుకునేందుకు అంగీకరించింది. ఇది 2020లో పోటీ చేసిన 70 సీట్ల కంటే తొమ్మిది సీట్లు తక్కువ. ఆ సమయంలో కాంగ్రెస్‌ 19 సీట్లను మాత్రమే గెలుచుకుంది. నాటి ఎ‍న్నికల్లో ఆర్జేడీ  144 స్థానాల్లో పోటీ చేయగా, 75 మంది అభ్యర్థులు గెలిచారు. ఇదిలా ఉండగా సీట్ల  కేటాయింపు ఇంకా జరగకముందే బుధవారం రాత్రి కాంగ్రెస్ తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ బుధవారం రాఘోపూర్ అసెంబ్లీ స్థానం నుండి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కాంగ్రెస్‌  తమ అభ్యర్థులను తొలి జాబితాను ప్రకటించడం గమనార్హం.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)