Breaking News

డిసెంబర్‌లోభారత్‌కు పుతిన్‌ రాక

Published on Wed, 10/01/2025 - 16:18

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2025, డిసెంబర్  ఐదారు తేదీలలో భారత్‌కు వచ్చి, ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకునే అవకాశం ఉందని సమాచారం.  రష్యా చమురు కొనుగోలుపై అమెరికా న్యూఢిల్లీపై శిక్షాత్మక సుంకాలను విధించిన దరిమిలా ఇరు దేశాల మధ్య సంబంధాలు  బలపడుతున్న తరుణంలో పుతిన్‌, ప్రధాని మోదీల భేటీ కీలకంగా మారనుంది.

గత ఆగస్టులో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)అజిత్ దోవల్ మాస్కో పర్యటన సందర్భంగా ఈ ఉన్నత స్థాయి పర్యటనను తొలుత ప్రకటించారు. అయితే ఆ సమయంలో తేదీలను ఖరారు చేయలేదు. రష్యా అధ్యక్షుడు  ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీని కలుసుకున్నారు.

సుంకాల విషయమై న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య ఉద్రిక్తతల మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌ రానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్‌- రష్యాలు ఎన్నో ఏళ్లుగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలు కలిగివున్నాయి. భారత్‌కు ఆయుధ సరఫరాదారులలో రష్యా ముందు వరుసలో ఉంటుంది. అలాగే రష్యన్ చమురును భారీగా దిగుమతి చేసుకుంటున్నదేశాలలో భారత్‌ ఒకటిగా నిలిచింది. కాగా అధ్యక్షుడు పుతిన్ పర్యటన భారత భౌగోళిక రాజకీయ వ్యూహాలలో కీలకంగా మారనుంది.
 

#

Tags : 1

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)