Breaking News

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు

Published on Mon, 07/14/2025 - 14:24

 సాక్షి,న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  గవర్నర్లను నియమించారు. హర్యానా గవర్నర్‌గా ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్,గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్ గజపతి రాజు (Pusapati Ashok Gajapathi Raju) ,లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తా నియమిస్తూ సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు

అశోక్‌ గజపతి రాజు రాజకీయ నేపథ్యం
పూసపాటి అశోక్ గజపతి రాజు టీడీపీ సీనియర్ నేతగా, కేంద్ర మాజీ మంత్రిగా రాజకీయాల్లో రాణించారు. తాజాగా ఆయన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గోవా గవర్నర్‌గా నియమించారు. అశోక్‌ గజపతిరాజు ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో ఎంపీగా గెలిచి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్సైజ్, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఫైనాన్స్ వంటి కీలక శాఖలను నిర్వహించారు.

రాజవంశీయ నేపథ్యం
అశోక్‌ గజపతి రాజు తండ్రి పూసపాటి విజయరామ గజపతి రాజు. విజయనగరం సంస్థానపు చివరి మహారాజు. అశోక్‌ గతపతి రాజు రాజకీయాలతో పాటు  సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా సేవలందించారు. ఇవాళ గోవా గవర్నర్‌గా అశోక్‌ గజపతి రాజును నియమిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ అధికారికంగా ప్రకటించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)