Breaking News

కలియుగానికి ఇదో ఉదాహరణ

Published on Thu, 02/27/2025 - 07:27

చండీగఢ్‌: వృద్ధురాలైన తల్లికి మనోవర్తిగా(Maintenance) నెలకు రూ.5 వేలు ఇవ్వాలంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై పంజాబ్‌ హరియాణా హైకోర్టు(Punjab & Haryana High Court)  ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కలియుగంలో జరుగుతున్న విపరీతాలకు ఇదో ఉదాహరణ అంటూ వ్యాఖ్యానించింది. సంగ్రూర్‌ కుటుంబ న్యాయస్థానంలో మూడు నెలల్లోగా రూ.50 వేలు డిపాజిట్‌ చేయాలంటూ పిటిషనర్‌ను ఆదేశించింది. పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు.. అది చాలా తక్కువ మొత్తమని తెలిపింది.

 మనోవర్తి మొత్తం పెంచాలంటూ పిటిషనర్‌ తల్లి ప్రత్యేకంగా ఎలాంటి విజ్ఞాపన చేయలేదని కూడా పేర్కొంది. 77 ఏళ్ల వృద్ధురాలి భర్త 1992లోనే చనిపోయారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. ఒక కుమారుడు చనిపోయాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఆమెకున్న సుమారు 30 ఎకరాల భూమిని పిటిషనర్‌ అయిన మరో కుమారుడు, చనిపోయిన కుమారుడి పిల్లలు పంచుకున్నారు. 1993లో మనోవర్తి కింద వృద్ధురాలికి రూ.లక్ష ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె కూతురు వద్దే ఉంటోంది. తన పోషణ భారం కుమార్తె మోయాల్సి రావడంతో వృద్ధురాలు సంగ్రూర్‌ కుటుంబ కోర్టును ఆశ్రయించారు. 

తల్లి తన వద్ద ఉండటం లేదు కాబట్టి, మనోవర్తి తాను ఇవ్వాల్సిన పనిలేదని కుమారుడు వాదించాడు. తోసిపుచి్చన న్యాయస్థానం నెలకు రూ.5 వేల చొప్పున అందజేయాలంటూ ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టులో సవాల్‌ చేశాడు. విచారణ సందర్భంగా న్యాయస్థానం..‘తన తల్లికి వ్యతిరేకంగా సాక్షాత్తూ కుమారుడే ఈ పిటిషన్‌ వేయడం చూసి మేం షాక్‌కు గురయ్యాం. తండ్రి నుంచి ఆస్తి సంక్రమించినప్పటికీ, ఎలాంటి ఆదాయ వనరుల్లేని వయో వృద్ధురాలైన తల్లిని పెళ్లయి మెట్టినింట్లో ఉంటున్న ఆమె కుమార్తె వద్ద వదిలేయడం దురదృష్టకరం. కలియుగంలో జరిగే వైపరీత్యాలకు ఈ కేసు సిసలైన ఉదాహరణ’అని వ్యాఖ్యానించింది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)