పంజాబ్‌ గవర్నర్‌ పదవికి బన్వరీలాల్ పురోహిత్ రాజీనామా

Published on Sat, 02/03/2024 - 16:15

చంఢీఘర్‌: పంజాబ్ గవర్నర్‌ బన్వరీలాల్ పురోహిత్ తన పదవికి రాజీనామా చేశారు. పంజాబ్‌ గవర్నర్‌ పదవి,  కేంద్ర పాలిత ప్రాంతం ఛండీఘర్‌ అడ్మినిస్ట్రేటర్‌ పదవికి వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు పంపిన రాజీనామా పత్రంలో.. తన రాజీనామాను దయచేసి అంగీకరించాలని కోరారు.

ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ నేతృత్వంలోని ఆప్‌ ప్రభుత్వం పంపిన పలు బిల్లులను ఆమోదించటంలో జాప్యం చేస్తున్న నేపథ్యంలో బన్వరీలాల్ పురోహిత్ గవర్నర్‌ పదవి రాజీనామా చేశారు. నవంబర్‌ 10, 2023లో పంజాబ్‌ అసెంబ్లీ పంపిన ఐదు బిల్లులను బన్వరీలాల్ పురోహిత్ ఆమోదం తెలపకుండా జాప్యం చేశారు. దీంతో పంజాబ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టును  ఆశ్రయించింది. విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకుండా జాప్యం చేయటాన్ని నిలదీసింది.  

అప్పటి నుంచి పంజాబ్‌ ప్రభుత్వానికి.. గవర్నర్‌ బన్వరీలాల్ పురోహిత్‌ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. బన్వరీలాల్ పురోహిత్‌ శుక్రవారం చంఢీఘర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిశారు. ఇక.. అమిత్‌ షాను కలిసిన  మరుసటి రోజు బన్వరీలాల్‌ పురోహిత్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేయటంపై చర్చ జరుగుతోంది.

Videos

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)