Breaking News

పంజాబ్‌లో ‘ఉచిత రేషన్‌’ ఎలా అందిస్తున్నారు?

Published on Mon, 03/11/2024 - 10:34

రాబోయే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు  ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలకు ఉచిత రేషన్ అందిస్తోంది. 

పంజాబ్‌లో ఇంటింటికీ ఉచిత రేషన్ పథకాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ పథకం కింద లబ్ధిదారులు ఇంటి వద్దనే రేషన్ అందుకోవచ్చు. మొదటి దశలో పంజాబ్‌లోని 25 లక్షల మందికి ఈ పథకం ప్రయోజనాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద ఒక్కొక్కరికి ఐదు కిలోల గోధుమ పిండిని ఉచితంగా అందజేస్తారు. మిగిలిన రేషన్‌ సరుకులను దఫదఫాలుగా అందించనున్నారు. 

పంజాబ్‌లో 38 లక్షల మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. 20, 500 ప్రభుత్వ రేషన్ దుకాణాలు ఉన్నాయి. 1,500 మందికి పైగా యూత్ డెలివరీ ఏజెంట్లు ఉన్నారు. మొదటి దశలో 25 లక్షల కుటుంబాలకు రేషన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద లబ్ధిదారులు ప్రతి నెలా ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందుకోవచ్చు. లబ్ధిదారులు గోధుమపిండి స్థానంలో ఇతర అందుబాటులో ఉన్న ఆహార ధాన్యాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించిన ఇంటింటికీ రేషన్ పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు లబ్ధిపొందవచ్చు. 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు