Breaking News

అనుమానిత వ్యాధి: ఒకరు మృతి.. వెంటిలేటర్‌పై 16 మంది.. 100 దాటిన బాధితులు

Published on Mon, 01/27/2025 - 09:37

ముంబై: మహారాష్ట్రను అనుమానిత వ్యాధి వణికిస్తోంది. గుల్లెయిన్-బారే సిండ్రోమ్‌(జీబీఎస్‌)గా భావిస్తున్న ఈ వ్యాధి కారణంగా షోలాపూర్‌లో చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఒకరు మృతిచెందారు. కొత్తగా ఈ వ్యాధి మరో 28 మందికి సోకిందని, దీంతో బాధితుల సంఖ్య 101కి  చేరిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఈ వ్యాధితో బాధపడుతున్న 16 మంది బాధితులు ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు  కలిగిన వారిలో 19 మంది తొమ్మిదేళ్ల కంటే తక్కువ వయస్సు గలవారని, ఇప్పటివరకు 50 నుంచి 80  ఏళ్ల మధ్య వయస్సు గల వారిలో 23 కేసులు నమోదయ్యాయని వైద్య అధికారులు తెలిపారు. 
జనవరి 9న పూణేలోని ఒక ఆస్పత్రిలో చేరిన రోగి  మొదటి జీబీఎస్‌ కేసుగా ఆరోగ్య శాఖ అనుమానిస్తోంది.

బాధితుల నుండి తీసుకున్న నమూనాలలో క్యాంపిలో బాక్టర్ జెజుని బ్యాక్టీరియా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. పూణేకు ప్రధాన నీటి వనరు అయిన ఖడక్వాస్లా ఆనకట్ట సమీపంలోని బావిలో ఈ. కోలి అనే బాక్టీరియా అధిక స్థాయిలో ఉందని  అధికారుల పరీక్షల్లో తేలింది. దీంతో ఈ నీటిని వినియోగించేవారు ముందుగా మరిగించి, వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఆదివారం నాటి వరకు 25,578 ఇళ్లను సర్వే చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బాధితులను కనుగొనేందుకే ఈ సర్వే చేపడుతున్నట్లు పేర్కొన్నారు.  జీబీఎస్‌ చికిత్స చాలా ఖరీదైనదని, ఒక్కో ఇంజెక్షన్ ధర రూ.20 వరకూ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. జీబీఎస్‌ అనేది శరీర రోగనిరోధక వ్యవస్థను అమితంగా ప్రభావితం చేస్తుంది. మెదడుకు సంకేతాలను తీసుకెళ్లే నరాలపై దాడి చేస్తుంది. అయితే ఈ వ్యాధి బారినపడిన 80 శాతం మంది రోగులు సరైన చికిత్స తీసుకుంటే ఆరు నెలల్లోనే కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: Mahakumbh-2025: ఏడాదిన్నరగా పరారై.. పుణ్యస్నానం చేస్తూ పోలీసులకు చిక్కి..

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)