Breaking News

డ్రీమ్‌ 11లో రూ.1.5 కోట్లు గెలుచుకున్న ఎస్‌ఐ సస్పెన్షన్.. ఎందుకంటే..?

Published on Thu, 10/19/2023 - 08:03

ముంబయి: డ్రీమ్‌ 11లో రూ.1.5 కోట్ల రూపాయలు గెలుచుకున్న ఓ ఎస్‌ఐకి అధికారులు షాక్ ఇచ్చారు. పోలీసు విభాగం ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ సదరు ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు వేశారు. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన అధికారి ఆన్‌లైన్ గేమింగ్‌లో పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. 

మహారాష్ట్ర పింప్రి చించ్వాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ సోమనాథ్ ఆన్‌లైన్ గేమింగ్‌లో పాల్గొన్నారు. ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా ఆయన తనకున్న జ్ఞానంతో టీంను ఎంచుకుని డ్రీమ్‌ 11లో పాల్గొన్నారు. అదృష్టం కలిసివచ్చి రూ.1.5 గెలుచుకున్నారు. దీంతో ఆయన తన కుటుంబానికి మిఠాయిలు తినిపిస్తూ ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. ఈ విషయం అధికారులు దృష్టికి వెళ్లడంతో విషయం పెద్దదైంది. 

ఆన్‌లైన్ గేమింగ్‌లో పాల్గొని పోలీసు శాఖ పరువు తీస్తున్నారంటూ ఉన్నతాధికారులు ఎస్‌ఐ సోమనాథ్‌పై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఈ వ్యవహారాన్ని స్థానిక డీసీపీకి అప్పగించారు. గత మూడు నెలలుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లో ఎస్‌ఐ సోమనాథ్ పాల్గొంటున్నారని నిర్దారించారు. ఈ వ్యవహారంలో సోమనాథ్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో రూ.1.5 గెలుచుకున్న ఆనందం ఆవిరైపోయింది.    

ఇదీ చదవండి: బీజేపీ కీలక నిర్ణయం.. గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి నియామకం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)