Breaking News

పూజా ఖేద్కర్ మోసం: యూపీఎస్సీ కీలక నిర్ణయం

Published on Wed, 10/01/2025 - 15:25

న్యూఢిల్లీ: పరీక్షలలో మోసం, వైకల్యం  సాకుగా చూపించడం, ఓబీసీ సర్టిఫికెట్ల దుర్వినియోగం తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్‌ ట్రైనీ పూజ ఖేద్కర్ కేసును దృష్టిలో ఉంచుకున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది.

యూపీఎస్సీ చైర్మన్ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఇకపై యూపీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల నిర్థారణకు ప్రభుత్వ క్లౌడ్ ఆధారిత వేదిక డిజీలాకర్ ద్వారా స్వీకరిస్తుందని తెలిపారు. దూరదర్శన్‌లో బుధవారం ప్రసారమైన కార్యక్రమంలో అజయ్ కుమార్ యూపీఎస్సీ అభ్యర్థులు ఈ మెయిల్‌లో పంపిన ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. ఒక అభ్యర్థి మాజీ ఐఎఎస్‌ ట్రైనీ పూజా ఖేద్కర్ కేసు గురించి అడిగినప్పుడు ‘తాము ఇటువంటి మోసపూరిత వ్యవహారాలను సహించబోమని, ఈ  అభ్యర్థిని మూడేళ్లు సస్పెండ్ చేశామని, క్రిమినల్ కేసులో, చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నామని’ అజయ్ కుమార్ తెలిపారు.

నకిలీ సర్టిఫికెట్ల సమస్యను పరిష్కరించేందుకు యూపీఎస్సీ త్వరలో ప్రభుత్వ క్లౌడ్-ఆధారిత డాక్యుమెంట్  ధృవీకరణ వేదిక అయిన డిజిలాకర్ ద్వారా సర్టిఫికెట్లను తీసుకుంటుందని అన్నారు.  కుల ధృవీకరణ పత్రాలు, బెంచ్‌మార్క్ వైకల్య ధృవీకరణ పత్రాలు, ఆదాయ ధృవీకరణ పత్రాలతో సహా అనేక రకాల సర్టిఫికెట్లను డిజీలాకర్‌ నుంచే గ్రహించడం జరుగుతుందన్నారు. ప్రామాణికతను కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తెలుసుకున్నట్లు తెలిపారు. గంటసేపు జరిగిన ఈ సెషన్‌లో అజయ్ కుమార్ అభ్యర్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వయోపరిమితి,  ప్రయత్నాల సంఖ్య మారుస్తారనే ఊహాగానాలను నమ్మవద్దని ఆయన అభ్యర్థులను కోరారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)