Breaking News

డార్క్ క్వీన్ సాన్ రేచల్ కన్నుమూత

Published on Mon, 07/14/2025 - 09:55

ప్రముఖ మోడల్ సాన్ రేచల్ (San Rechal) బలవన్మరణానికి పాల్పడింది. పుదుచ్చేరిలో తన నివాసంలో ఆమె నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి ప్రయత్నించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందతూ శనివారం కన్నుమూసింది. 

పుదుచ్చేరిలో పుట్టిపెరిగిన సాన్‌ రేచల్‌.. మోడలింగ్ రంగంలో మిస్ డార్క్ క్వీన్‌గా, మిస్ బెస్ట్ ఆటిట్యూడ్‌గా, మిస్ ఆఫ్రికా గోల్డెన్ ఇండియా లాంటి టైటిల్స్‌ గెలుచుకున్నారు. మోడలింగ్‌ మాత్రమే కాదు.. ఆమె మెడిసిన్‌ విద్యనూ అభ్యసించారు. ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి కారణంగా  డిప్రెషన్‌లోకి వెళ్లిన ఆమె.. అధిక డోస్‌లో నిద్ర మాత్రలు తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. గమనించిన కుటుంబ సభ్యుల ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆమె.. రెండు కిడ్నీలు చెడిపోవడంతో జూలై 12వ తేదీన కన్నుమూసినట్లు సమాచారం.

రేచల్‌ తల్లి ఆమె చిన్నతనంలోనే కేన్సర్‌తో కన్నుమూసింది. అప్పటి నుంచి తండ్రి, సోదరుడి ప్రోత్సాహంతో ఆమె పెరిగారు. రంగు గురించి తోటి స్నేహితులు, బంధువులు ఆమెను ఎగతాళి చేసేవారు. అయినా ఆమె కుంగిపోలేదు. ‘‘రంగులో ఏముందిలే.. కరుపు(నలుపు) కూడా అందమే’’ అనే ఆమె మాటలు మోడలింగ్‌ రంగంలో ఎంతో మందికి ప్రేరణగా నిలిచాయి. అయితే..

సూసైడ్ నోట్‌లో.. తన మరణానికి భర్త(ఇటీవలె వివాహం జరిగింది), కుటుంబ సభ్యులు కారణం కాదని ఆమె ఒక లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆమె మృతిపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అవమానాలను, ట్రోలింగ్‌ను తట్టుకుని మోడలింగ్‌ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకున్న రేచల్‌.. పాతికేళ్లకే ఇలా తనువు చాలించడం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు.. అలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
 

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)