Breaking News

కాటన్‌ క్యాండీలపై నిషేధం.. వీడియో విడుదల చేసిన తమిళిసై!

Published on Mon, 02/12/2024 - 12:24

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాటన్‌ క్యాండీ (తీపి తినుబండారం) విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సుందరరాజన్  ప్రకటించారు. విషపూరిత రసాయనాలను ఉపయోగించి కాటన్‌ క్యాండీలను తయారు చేస్తున్నారనే కారణంతోనే వీటిపై నిషేధం విధించారు. 

ఒక వీడియోలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ మాట్లాడుతూ కాటన్ క్యాండీలో విషపూరిత రోడోమైన్ బీ ఉన్నట్లు ఆహార అధికారులు కనుగొన్నారన్నారు. కాటన్‌ క్యాండీలలోని  విష రసాయనాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. అందుకే పుదుచ్చేరిలో  కాటన్‌ క్యాండీ విక్రయాలను నిషేధిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు. 
 

లెఫ్టినెంట్ గవర్నర్ తన అధికారిక సోషల్‌ మీడియా పేజీలో దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ షేర్‌ చేశారు. పిల్లల కోసం కాటన్ క్యాండీలను కొనుగోలు చేయడం మానుకోవాలని, అందులోని రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని తెలిపారు. కాటన్‌ క్యాండీలు విక్రయించే అన్ని దుకాణాలలో తనిఖీ చేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ ఆ వీడియోలో తెలిపారు. 

నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హెల్త్ తెలిపిన వివరాల ప్రకారం, రోడోమైన్ బీ అనే రసాయనాన్ని ఆహార పదార్థాలకు రంగు వచ్చేందుకు ఉపయోగిస్తారు. ఇది శరీరంలోకి ‍ప్రవేశించినప్పుడు కణాలలో ఆక్సీకరణ ఉద్రిక్తతకు కారణమవుతుంది. ఫలితంగా కాలేయ వైఫల్యం, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు  ఎదురయ్యేందుకు అవకాశం ఉంది.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)