Breaking News

హత్యకు దారి తీసి పబ్‌లో గొడవ!

Published on Mon, 06/01/2026 - 08:51

సాక్షి,చెన్నై: కోయంబేడులో  శనివారం  అర్ధరాత్రి దాటి న తర్వాత దారుణ ఘటన చోటుచేసుకుంది.  ఒక ప్రైవేట్‌ స్టార్‌ హోటల్‌ పబ్‌లో మద్యం మత్తులో డ్యాన్స్‌ చేస్తూ మొదలైన చిన్న వివాదం.. చివరకు ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. గంజాయి, మద్యం మత్తు లో ఉన్న ఒక ముఠా.. కక్షపూరితంగా బైక్‌ను కారుతో ఢీకొట్టడంతో ప్లస్‌–2 చదువు పూర్తి చేసిన  శ్రీలంక త మిళ శరణార్థి శిబిరం యువతి అక్కడికక్కడే మరణించింది. 

ఈ ఘోర ఘటనలో మరో 17 ఏళ్ల బాలిక తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. విల్లుపురం జిల్లా అనిచన్‌ కుప్పంలోని శ్రీలంక తమిళ పునరావాస శిబి రానికి చెందిన యాన్సీ(18) ఇటీవల ప్లస్‌–2 పరీక్షల్లో 450 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆమె ఉన్నత చదువుల కోసం అలగప్ప విశ్వవిద్యాలయానికి దరఖా స్తు చేసుకుంది. ఈ క్రమంలో చెన్నై రామపురంలో నివసిస్తున్న తన స్నేహితురాలిని (17 ఏళ్ల బాలిక) కలవడానికి యాన్సీ కొద్దిరోజుల క్రితం చెన్నైకి వచ్చింది. 

శనివారం రాత్రి యాన్సీ, ఆమె స్నేహితురాలు తబిత (18) అనే మరో యువతితో పాటూ యువకులు కలిసి మొత్తం ఆరుగురు మూడు మోటారు సైకిళ్లపై  కోయంబేడు ఫ్లైఓవర్‌ సమీపంలోని ఓ ప్రైవేట్‌ స్టార్‌ హోటల్‌ పబ్‌కు వెళ్లారు. అక్కడ మద్యం సేవించిన తర్వాత యాన్సీ బృందం నృత్యం చేస్తున్న సమయంలో  అక్క డ మద్యం మత్తులో ఉన్న మరో వర్గానికి చెందిన యు వకులతో వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పబ్‌ లో గందరగోళం నెలకొంది. హో టల్‌ బౌన్సర్లు ఇరు వర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి  బయటకు గెంటేశారు. బయటకు వచ్చినా మరోసారి గొడవ పడ్డారు. తర్వాత ఇళ్లకు బయలుదేరారు. 

కారుతో తొక్కించి హత్య 
గొడవతో తీవ్ర ఆగ్రహానికి గురైన కారు డ్రైవర్‌ సుమన్‌ శక్తివేల్‌ (20) బైక్‌పై ప్రయాణిస్తున్న యువతులను చంపాలనే ఉద్దేశంతో కారును మెరుపు వేగంతో వారి బైక్‌ వైపు పోనిచ్చి బలంగా ఢీకొట్టాడు. దీంతో బైక్‌ నడుపుతున్న యాన్సీ, వెనుక కూర్చున్న 17 ఏళ్ల బాలిక గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయారు. తలకు తీవ్ర గాయమై, ముఖం పూర్తిగా చిద్రమైన స్థితిలో యాన్సీ (18) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రగాయాలైన బాలికను కోయంబేడు కిల్‌పాక్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా నిరుపేద కూలీ అయిన యాన్సీ తండ్రి నకులేశ్వరన్‌ , కుటుంబ సభ్యులు ఈ వార్త విని కన్నీరుమున్నీరవుతున్నారు.  

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)