Breaking News

టమాటా వ్యాపారికి బౌన్సర్లంటూ తప్పుడు వార్తా కథనం.. పీటీఐ క్షమాపణలు

Published on Mon, 07/10/2023 - 07:45

వారణాసి: టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో షాపు ముందు ఓ వ్యాపారి ఇద్దరు బౌన్సర్లను నియమించాడనే వార్త పీటీఐకి చిక్కులు తెచ్చిపెట్టింది. ఎట్టకేలకు ఆ వార్త అవాస్తవమైనదని పీటీఐ తెలిపింది. ఇలాంటి సమాచారాన్ని ప్రసారం చేసినందుకు క్షమాపణలు చెప్పింది.  నిజనిర్ధారణ చేయడంలో విఫలమయ్యామని వెల్లడించింది.

ఆ షాపు ఓనర్‌ను సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తగా గుర్తించామని పీటీఐ తెలిపింది. టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రశ్నించే ఉద్దేశంతోనే ఆ సమాచారాన్ని తమకు అందించినట్లు పీటీఐ భావించింది. వార్తల ఉన్నత ప్రమాణాలను చేరడంలో ఈ సారికి తప్పు జరిగిందని స్పష్టం చేసింది. ఆ ట్వీట్‌ను వెంటనే తొలగించినట్లు పేర్కొంది. ఉన్నత విలువలతో కూడిన నిష్పాక్షిమైన వార్తలను అందించడానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇస్తున్నట్లు ట్వీట్ చేసింది. 

దేశంలో టమాటా ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కేజీ ధర రూ.160 పైనే ఉంది. దీంతో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే యూపీలోని వారణాసిలో ఓ షాపు యజమాని తన టమాటా షాపు ముందు వినియోగదారులను అదుపు చేయడానికి  ఇద్దరు బౌన్సర్లను పెట్టుకున్నట్లు పీటీఐ వార్తను ప్రసారం చేసింది. దొంగలు షాపు నుంచి టమాటాను ఎత్తుకుపోతున్నట్లు ఆ యజమాని పేర్కొన్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ అంశం తప్పు అని చెబుతూ ప్రసారం చేసినందుకు క్షమాపణలు చెప్పింది.

ఇదీ చదవండి: టమాటాలు తెచ్చిన తంటాలు.. బౌన్సర్లను పెట్టుకున్న వ్యాపారి.. 

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు