Breaking News

పార్లమెంట్ అలజడి ఘటన.. నిందితులకు మానసిక పరీక్షలు

Published on Fri, 12/22/2023 - 08:20

ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో నిందితులను మానసిక పరీక్షలు(సైకో ఎనాలసిస్) నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలతో పార్లమెంట్ అలజడి ఘటనకు పాల్పడటానికి నిందితుల అసలు ఉద్దేశం తెలుసుకునే అవకాశం ఉంటుంది. గురువారం ఒక నిందితున్ని ఫోరెన్సిక్ సైన్స్ లాబెరేటరీకి తీసుకెళ్లారు. ఒక్కొక్కర్ని ఈ పరీక్షలకు తీసుకెళ్లనున్నారు.

సైకో ఎనాలసిస్ పరీక్షల్లో నిందితుల అలవాట్లు, నిత్య జీవణ శైలి, స్వభావం తదితరాలు తెలుసుకుంటారు. సైక్రియాట్రిస్ట్ ప్రశ్న-జవాబుల విధానంలోనే ఈ టెస్ట్ ఉంటుంది. ఇచ్చిన జవాబుల ఆధారంగా నిందితుల వెనక ఉన్న అసలు ఉద్దేశాలను వైద్యులు అంచనా వేస్తారు. ఈ పరీక్షలు దాదాపు మూడు గంటలపాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరుపుతారు. శ్రద్ధా వాకర్ మర్డర్ కేసు, షహ్‌బాద్ డైరీ మర్డర్ కేసుల్లో నిందితులపై పోలీసులు ఇలాంటి పరీక్షలను నిర్వహించారు. 

డిసెంబర్ 13న పార్లమెంట్‌లోకి నలుగురు ఆగంతకులు ప్రవేేశించారు. ఇద్దరు లోక్‌సభ లోపల గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో గ్యాస్ బాంబులను ప్రయోగించారు. దీంతో పార్లమెంట్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అంశంతో పార్లమెంట్ భద్రతా విధులను ఢిల్లీ పోలీసుల నుంచి కేంద్ర బలగాలకు బదిలీ చేశారు. 

ఇదీ చదవండి: పార్లమెంట్‌లో మరో ముగ్గురు ఎంపీల సస్పెండ్‌.. మొత్తం 146 మంది

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)