ఈద్ వేళ సీఎం మమత సంచలన ఆరోపణలు

Published on Mon, 03/31/2025 - 11:56

కోల్‌కతా: ఈరోజు (సోమవారం) దేశంలో ఈద్ వేడుకలు(Eid celebrations) అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. పలు పార్టీల నేతలు ముస్లిం సోదరులను కలుసుకుని, వారికి ఈద్‌ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంతలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. కోల్‌కతాలో జరుగుతున్న ఈద్ ప్రార్థనల సందర్భంగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ  ‘బెంగాల్‌లో అల్లర్లను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఉచ్చులో పడకండి. బెంగాల్ ప్రభుత్వం మైనారిటీలకు అండగా నిలుస్తుంది. రాష్ట్రంలో ఎవరూ ఉద్రిక్తతలను రెచ్చగొట్టలేరు’ అని వ్యాఖ్యానించారు.  

‘ప్రాణ త్యాగానికైనా సిద్ధం’
కోల్‌కతాలోని ఈద్గాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మమతా బెనర్జీ(CM Mamata Banerjee) మాట్లాడుతూ ‘మేము లౌకికవాదులం. ఒకవైపు నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ  సందర్భంగానూ శుభాకాంక్షలు చెబుతున్నాం.  ఇటువంటి సమయంలో ఎవరూ అరాచకాన్ని వ్యాప్తి చేయకూడదని కోరుకుంటున్నాం. సామాన్యులెవరూ అరాచకాన్ని వ్యాప్తి చేయరు. రాజకీయ పార్టీలు అలాంటి చర్యలకు పాల్పడతాయి. ఇది సిగ్గుచేటు. అన్ని మతాలను పరిరక్షించేందుకు ప్రాణాలను త్యాగం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మైనారిటీలను రక్షించడం మెజారిటీల కర్తవ్యం. మైనారిటీల కర్తవ్యం మెజారిటీల మధ్య జీవించడం’ అని పేర్కొన్నారు.
 

‘వారు ఐక్యతను విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు’
‘ఈద్ కోసం తాను లండన్ నుండి ముందుగానే ఇక్కడికి తిరిగి వచ్చాను. అందరూ శాంతియుతంగా జీవించాలి, సామరస్యంగా మెలగాలి. మేము ఎల్లప్పుడూ మైనారిటీలకు మద్దతు అందిస్తాం. వామపక్షాలవారు, ‘రాముడు’ కలిసి నేను హిందువునా కాదా అని నన్ను అడిగారు? నేను హిందువును, ముస్లింను అని గర్వంగా వారికి సమాధానం చెప్పాను. వారు ఐక్యతను విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు.  అల్లర్లు సృష్టించాలనుకుంటున్నారు, వారి ఉచ్చులో పడకండి. దీదీ మీతో ఉన్నారు. అభిషేక్ మీతో ఉన్నారు. ప్రభుత్వమంతా మీతోనే ఉంది’అని పేర్కొన్నారు.

‘మైనారిటీతో కలిసి జీవించడమే మెజారిటీ మతం’
‘వారు అల్లర్లు సృష్టించి, రాష్ట్రపతి పాలన(President's rule) గురించి మాట్లాడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో, మణిపూర్‌లో ఏమి జరిగింది? రాజ్యాంగాన్ని సురక్షితంగా ఉంచండి. అల్లర్లు సామాన్యులు చేయరు. రాజకీయ పార్టీలవారే చేస్తారు. మైనారిటీతో కలిసి జీవించడమే మెజారిటీ మతం. మేము రామకృష్టుడు, వివేకానందులను నమ్ముతాం. కానీ జుమ్లా పార్టీ సృష్టించిన మతానికి మేం వ్యతిరేకం. అది హిందూ వ్యతిరేకం. వారు ఒప్పందాలు చేసుకుంటారు. నేను ఎవరినీ అల్లర్లు చేయనివ్వను’ అని మమత వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Newton Death Anniversary: నేటికీ వెల్లడికాని న్యూటన్‌ మరణ రహస్యం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)