Breaking News

పేపర్ లీకేజీపై అశోక్‌ గహ్లోత్‌కు సెగ..బీజేపీ నిరసనలు..

Published on Tue, 06/13/2023 - 15:12

రాజస్థాన్‌:టీచర్ పోస్టుల రిక్రూట్‌మెంట్‌లో పేపర్ లీకేజీ వ్యవహారంపై రాజస్థాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నిరసనలు చేపట్టింది. ఆందోళనకారులు రాష్ట్ర సెక్రటేరియట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆందోళనకారులను చెదరగట్టడానికి పోలీసులు బారీకేడ్లు, జలఫిరంగులు ఉపయోగించారు.  

అయితే.. ఈ పేపర్ లీకేజీ వ్యవహారంపై రాష్ట్రంలో పలుచోట్ల గత నెలలో ఈడీ దర్యాప్తు చేసింది. దీనిపై సీఎం అశోక్ గహ్లోత్ అప్పట్లోనే అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నందున కేంద్రం ఈడీని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. పేపర్ లీకేజీపై రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ మెరుగైన రీతిలో పనిచేస్తున్నప్పటికీ ఈడీ ఎందుకు తలదూర్చుతోందని ప్రశ్నించారు.  

ఆ రాష్ట్రంలో 2021లో నిర్వహించిన టీచర్ రిక్రూట్‌మెంట్‌లో పేపర్ లీకేజీ అయినట్లు పలు ప్రాథమిక ఆధారాలు లభించాయి. అనంతరం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022లో నిర్వహించిన పరీక్షల్లోనూ లీకేజీ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ బాబులాల్ కటారాతో పాటు ఆయన మేనల్లున్ని, ఓ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.      

ఇదీ చదవండి:సీఎం మమతా బెనర్జీకి బంగ్లాదేశ్ సూపర్ కానుక..!

Videos

కొండా రెడ్డి బురుజు సాక్షిగా దొరికిన బడి దొంగలు

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)