Breaking News

సైకిల్‌పై అద్వానీ.. పోస్టాఫీసులో కమల.. పెళ్లి జరిగిందిలా!

Published on Sat, 02/03/2024 - 13:27

బీజేపీ మాజీ అధ్యక్షుడు, అటల్ ప్రభుత్వంలో ఉప ప్రధాని సేవలందించిన లాల్ కృష్ణ అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను అందజేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నేపధ్యంలో అద్వానీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

భారత రాజకీయాల్లో భీష్మ పితామహునిగా పేరొందిన అద్వానీ రాజకీయ జీవితంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా మార్గదర్శకునిగా నిలిచారు. కమలతో అద్వానీ వివాహం అత్యంత విచిత్ర పరిస్థితుల్లో జరిగింది. 

కమలా అద్వానీ పాకిస్తాన్‌లోని సింధ్‌లో జన్మించారు. ఆమె అసలు పేరు కమలా జగత్యాని. విభజన తర్వాత వారి కుటుంబం భారతదేశానికి తరలి వచ్చింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కమల చదువు పూర్తి చేసుకున్నాక, ఢిల్లీ పోస్టాఫీసులో  ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 

ఇదీ చదవండి: ఎల్‌కే అద్వానీకి భారతరత్న.. మోదీ భావోద్వేగం

అదే సమయంలో ఆమెకు లాల్ కృష్ణ అద్వానీ నుంచి వివాహ ప్రతిపాదన వచ్చింది. అప్పట్లో లాల్ కృష్ణ అద్వానీ జర్నలిస్టుగా పనిచేసేవారు. ప్యాంటు షర్టు వేసుకుని, సైకిల్‌పై ఆఫీసుకు వెళ్లేవారు. కమల అద్వానీలకు 1965, ఫిబ్రవరి 25న వివాహం జరిగింది. 

అద్వానీ భార్య కమలా అద్వానీ రాజకీయాల్లో కాలుమోపనప్పటికీ, పలు కార్యక్రమాలలో అద్వానీతో పాటు కనిపించారు.  ఆమె అద్వానీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారు. అలాగే అద్వానీ తినే ఆహారం మొదలుకొని, అతనిని కలుసుకునే వారి జాబితా వరకు అన్నింటిపై కమలా అద్వానీ ఒక కన్నేసి ఉంచేవారు. అద్వానీ ఒక సందర్భంలో తాను దేశానికే హోంమంత్రినని, ఇంటిలో తన సతీమణి కమలనే హోంమంత్రి అంటూ చమత్కరించారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)